kushi movie : ఖుషి సక్సెస్.. సమంత అరుదైన రికార్డ్
X
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి. సెప్టెంబర్ 1న విడుదలైన ఈ సినిమా.. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా థియేటర్లలో అందరినీ ఖుషీ చేస్తోంది. ఈ సినిమాను శివ డైరెక్ట్ చేయగా.. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మించారు. సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా.. సమంత, విజయలను ఫామ్ లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు రాబడుతోంది. దీంతో పాటు అటు ఓవర్సీస్ లోనూ కలెక్షన్ల వర్షం కురుస్తోంది.
కేవలం రెండు రోజుల్లోనూ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది. అమెరికాలో ప్రీమియర్ షోలతోనే 4 లక్షల డాలర్లను అందుకుంది. ఖుషి సక్సెస్ తో సమంత అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఆమె నటించిన 17 సినిమాలు అమెరికాలో ‘మిలియన్ డాలర్’ క్లబ్ లో చేరాయి. ఈ ఘనత సాధించిన మొదటి నటిగా సమంత రికార్డ్ కెక్కింది. ప్రస్తుతం థియేటర్లలో దుమ్ము రేపుతున్న ఈ సినిమా ఆరువారాల తర్వాత ఓటీటీలోకి రానుంది. కాగా ఖుషి స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.