Home > సినిమా > క్లబ్‎లో సమంత డ్యాన్స్..ఓ ఊపు ఊపేసిందంటున్న ఫ్యాన్స్..వీడియో వైరల్

క్లబ్‎లో సమంత డ్యాన్స్..ఓ ఊపు ఊపేసిందంటున్న ఫ్యాన్స్..వీడియో వైరల్

క్లబ్‎లో సమంత డ్యాన్స్..ఓ ఊపు ఊపేసిందంటున్న ఫ్యాన్స్..వీడియో వైరల్
X

సమంత ఏం చేసినా వైరలే..ఏం మాట్లాడినా సెన్సేషనే. ఆమె కనిపిస్తే చాలు సోషల్ మీడియా షేక్ అయిపోతుంటుంది. నెట్టింట్లో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. తాజాగా సమంత మరోసారి నెట్టింట్లో రచ్చ రచ్చ చేసేసింది. తన డ్యాన్స్ మూవ్స్‎తో కుర్రాళ్ళ హృదయాలను దోచేస్తోంది. సిటడెల్ షూటింగ్ నిమిత్తం సామ్ ప్రస్తుతం సెర్బియాలో ఉంది. షూటింగ్‎ను పూర్తి చేసుకుని ఓ క్లబ్‎కు వెళ్లిన సమంత తనకు మాస్ లెవెల్ క్రేజ్‎ను తీసుకువచ్చిన పుష్ప సినిమాలోని సెన్సేషనల్ పాటకు క్యూట్ స్టెప్పులు వేసి అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సామ్ స్టెప్పులు చూసి అందరూ మరోసారి ఆమెతో ప్రేమలో పడిపోతున్నారు.




పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా’ పాటకు ఏ రేంజ్‎లో క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింగర్ వాయిస్, మ్యూజిక్ డైరెక్టర్ మ్యాజిక్‎కు తోడు స్టార్ హీరోయిన్ సమంత మొదటిసారిగా చేసిన స్పెషల్ సాంగ్ కావడంతో ఈ పాట ఎక్కడికో వెళ్లిపోయింది. ఇంటర్నెట్‌ను ఓ లెవెల్‎లో షేక్‌ చేసింది ఈ పాట. ఈ పాటలో సమంత లుక్స్, ఆమె డ్యాన్స్‎ను ఆమె అభిమానులు ఎప్పటికీ మరిచిపోరు. సెలబ్రిటీల నుంచి సినీ లవర్స్ వరకు ప్రతి ఒక్కరు ఈ పాటకు ఫిదా అయ్యారు. అంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా' పాటకు తాజాగా మరోసారి స్టెప్పులు వేసి సమంత రచ్చ రచ్చ చేసింది. సిటడెల్ షూటింగ్ కోసం సెర్బిరాలో ఉంటున్న సామ్ సాయంత్రం కాస్త రీఫ్రెష్ అవ్వాలని ఓ క్లబ్‌ కి వెళ్లింది. అక్కడ సరదాగా ఈ పాటకు స్టెప్పులు వేసి అక్కడున్నవారిని ఆకట్టుకుంది. సిటడెల్ హీరో బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ కూడా డ్యాన్స్‌ చేయాలంటూ సామ్‏ను ఎంకరేజ్ చేశాడు. ఈ వీడియో కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.







Updated : 11 Jun 2023 8:54 AM IST
Tags:    
Next Story
Share it
Top