తల్లి కాబోతున్న సమంత..ఎక్కడంటే?
X
దక్షిణాది స్టార్ హీరోయిన్లలో సమంతకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అత్యంత స్ట్రాంగెస్ట్ యాక్ట్రెస్‌గా సమంతను భావిస్తుంటారు. ఓ వైపు తన వ్యక్తిగత జీవితంతో పోరాడుతూనే …మరోవైపు తన కెరీర్లోనూ విజయాలను సొంతం చేసుకోవాలనే తపనతో ముందుకెళ్తోంది ఈ బ్యూటీ. సినిమాలైనా, రియల్ లైఫ్ అయినా సామ్ శ్రమించే విధానం అందరికీ స్ఫూర్తిని కలిగిస్తుంటుంది. సినీ రంగంలో మహిళా శక్తిని చూపిస్తున్న నటీమణుల లిస్టులో సమంత పేరు తప్పక ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటి వరకు సామ్ ఏ సినిమా చేసినా అది బాక్సాఫీస్‌ను షేక్ చేసిందనే చెప్పాలి. కానీ స్టార్ ఇమేజ్ ఉన్న సమంత ఈ మధ్యనే విడుదలైన శాకుంతలంతో పెద్ద డిజాస్టర్‌ను తన అకౌంట్లో వేసుకుంది. అయినా ఎక్కడా నిరుత్సాహ పడకుండా ఈ అమ్మడు మరింత జోష్‌ను నింపుకుని ముందకువెళ్తోంది. తాజాగా ఈ బ్యూటీ విజయదేవరకొండతో ఖుషి సినిమాతో పాటు , రాజ్ అండ్ డీకే డైరెక్షన్లో వస్తున్న వెబ్ సిరీస్ సీటాడెల్‌లో నటిస్తోంది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఇప్పుడు సమంతకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. సమంత త్వరలో తల్లి కాబోతోందంటూ మీడియా కోడై కూస్తోంది.
ఆగండి..ఆగండి..తల్లి అంటే రియల్ లైఫ్‌లో కాదు. రీల్లో తల్లిగా కనిపించబోతోందట. అందులోనూ ప్రియాంక చోప్రాకు తల్లిగా నటిస్తోందట సామ్. ఇది విన్న ఫ్యాన్స్ షాక్ లో ఉన్నప్పటికీ సమంతనే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా రివీల్ చేయడంతో నెట్టింట్లో ఈ విషయం తెగ వైరల్ అవుతోంది.
అమెజాన్ లో సీటాడెల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌లో ప్రియాంక యాక్షన్ సీన్స్‌తో ఓ రేంజ్ లో అదరగొట్టేసింది. ఏజెంట్ పాత్రలో కనిపించిన ప్రియాంక తన క్యారెక్టర్ కు తగ్గట్లుగా నటించి ఫ్యాన్స్ ను అలరించింది. కొన్ని యాక్షన్స్ సీన్స్ లో అదిరిపోయే స్టంట్స్ చేయడంతో పాటు బోల్డ్ సీన్స్ లోనూ రెచ్చిపోయి మరీ నటించింది.
త్వరలో ఇండియన్ వర్షన్ సీటాడెల్ కూడా విడుదల కాబోతోంది. ఇందులో సమంత నటిస్తోంది. అయితే ఫ్యాన్స్ అంతా ఈ సిరీస్ లో ప్రియాంక పాత్రలో సమంత కనిపిస్తుందని భావించారు.కానీ అది వాస్తవం కాదట. ఓ తల్లి పాత్రలో సమంత నటించనుందట. ప్రియాంక చోప్రా తల్లి పాత్రలో సమంత కనిపించనుందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని సమంత ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.
ప్రియాంకా తల్లి పాత్ర పోషించినప్పటికీ ఈ సిరీస్‌లో ప్రియాంకా క్యారెక్టర్ ఓ పాపగా కనిపిస్తుంది. నిజానికి సీటాడెల్ షూటింగ్ సమయాల్లో వీరిద్దరూ అసలు కలుసుకోరట. అయితే సమంత తల్లి పాత్ర గురించి ఇప్పటి వరకు ఎవరూ అధికారికంగా స్పందించలేదు. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకేనే సిటడెల్ ఇండియాను డైరెక్ట్ చేస్తున్నారు. దీంతో ఈ సిరీస్ పైన అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఇండియన్ వెర్షన్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ సిరీస్‌లో సమంత, వరుణ్ ధావన్ జోడీగా నటిస్తున్నారు.