Home > సినిమా > చంపుతామంటూ బెదిరింపులు... యూట్యూబ్ ఛానెల్‌పై ప్రకాష్ రాజ్ ఫిర్యాదు

చంపుతామంటూ బెదిరింపులు... యూట్యూబ్ ఛానెల్‌పై ప్రకాష్ రాజ్ ఫిర్యాదు

చంపుతామంటూ బెదిరింపులు... యూట్యూబ్ ఛానెల్‌పై ప్రకాష్ రాజ్ ఫిర్యాదు
X

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌ను చంపుతామంటూ హత్య బెదిరింపులు వచ్చాయి. సనాతన ధర్మానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగానే ఈ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ప్రకాష్ రాజ్ ఇటీవల సనాతన ధర్మానికి సంబంధించి చేసిన వ్యాఖ్యల కారణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యారు. బెదిరింపులకు సంబంధించిన వీడియోలను ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రసారం చేయగా.. ప్రకాష్ రాజ్ ఆ ఛానెల్‌పై బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ యూట్యూబర్ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఫిర్యాదు చేసిన రెండు రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నటుడు ప్రకాష్ రాజ్‌ని చంపేస్తానని బెదిరిస్తున్న వీడియోను చూపించినందుకు గాను ఓ యూట్యూబ్ ఛానెల్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై సెంట్రల్ డీసీపీ మాట్లాడుతూ.. 'రెండు రోజుల క్రితం అశోక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ప్రకాష్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు.

మీడియా కథనాల ప్రకారం.. ప్రకాష్ రాజ్‌పై బెదిరింపుతో కూడిన వీడియోను యూట్యూబ్‌లో వేల వ్యూస్ వచ్చినట్లు సమాచారం. విక్రమ్ టీవీ అనే యూట్యూబ్ ఛానెల్ లో తనను, తన కుటుంబ సభ్యులను నెగిటివ్ గా చూపించారని నటుడు ప్రకాష్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా.. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.



Updated : 21 Sept 2023 7:49 AM IST
Tags:    
Next Story
Share it
Top