Bigg Boss Season 7 : ఆట సందీప్ వర్సెస్ ప్రియాంక జైన్.. గెలిచిందెవరంటే..?
X
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొదటి వారం ముగిసింది. హౌస్మేట్ అయ్యేందుకు అర్హత సాధించడంతో పాటు 5వారాల పాటు ఇమ్యూనిటి పవర్ ఇచ్చే పవర్ అస్త్రా కోసం బిగ్ బాస్ పెట్టిన పోటీ ముగిసింది. ఇందుకోసం ఆట సందీప్, ప్రియాంక జైన్ ఫైట్ చేశారు. దీంతో వీకెండ్ ఎపిసోడ్ కాస్త ఆసక్తికరంగా సాగింది. నిజానికి పవర్ అస్త్రా కోసం ఆట సందీప్, ప్రియాంక జైన్, రతిక, శివాజీ పోటీ పడ్డారు. అయితే మిగతా కంటెస్టెంట్స్ అభిప్రాయం ఆధారంగా శివాజీ, రతిక పోటీ నుంచి తప్పుకున్నారు.
పవర్ అస్త్రా కోసం సందీప్, ప్రియాంక మధ్య పోటీ పెట్టిన బిగ్ బాస్ బెంచ్ మీద ఇద్దరూ నడుస్తూ.. చివరన ఉన్న ఓ బుట్టలో బంతులు వేయాలన్న టాస్క్ ఇచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 7 కావడంతో 7 నిమిషాల టైం ఇచ్చాడు. ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తే వారే విన్నర్ అని చెప్పాడు. ప్రియాంక మెుత్తం 34 బంతులు వేయగా.. సందీప్ 43 వేశాడు. దీంతో రేసులో సందీప్ విన్నర్ గా నిలిచాడు. దీంతో హోస్ట్ నాగార్జున పవర్ అస్త్రాను ప్రియాంక చేతుల మీదుగా సందీప్కు ఇప్పించాడు పవర్ అస్త్రా సాధించిన కంటెస్టెంట్ హౌస్ మేట్ గా అర్హత సాధించడంతో పాటు 5 వారాల ఇమ్యూనిటీ, ఇంకా చాలా లాభాలు ఉంటాయని బిగ్ బాస్ చెప్పాడు. అలా పవర్ అస్త్రా గెలిచిన సందీప్ మెుదటి హౌజ్ మేట్‍గా కన్ఫర్మ్ అయ్యాడు. అంతే కాదు మిగతా కంటెస్టెంట్స్ 5 వారాల పాటు ఆయనను నామినేట్ చేసే అవకాశముండదు.
ఇదిలా ఉంటే పవర్ అస్త్రా పోటీలో సందీప్, ప్రియాంకతో పాటు శివాజీ, రతిక కూడా బరిలో నిలిచారు. అయితే మిగతా కంటెస్టెంట్స్ అంతా వారిద్దరూ యాక్టివిటీ రూంలో ఏం చేశారో తెలియదని, అందుకే నామినేట్ చేశామని చెప్పారు. దీనిపై శనివారం నాగార్జున క్లారిటీ ఇచ్చాడు. బిగ్ బాస్ను ఇంప్రెస్ చేయమని చెప్పడంతో శివాజీ కాఫీ వంకతో కంటెస్టెంట్స్ అందరినీ తనవైపు తిప్పుకొని ఎంటర్టైన్ చేసి బిగ్ బాస్ మెప్పుపొందాడని చెప్పాడు. రతిక సైతం యాక్టివిటీ రూంలో ఉడత ఉడత ఊచ్ పాటను రెండున్నర గంటల పాటు విన్నదని, అయితే అందులో ఎన్ని ఉడతలు ఉన్నాయని బిగ్ బాస్ ప్రశ్నించగా లెక్కలు వేసుకుని 1056 అని సరైన సమాధానం చెప్పిందని స్పష్టం చేశారు.