Home > సినిమా > Sandeepreddy Vanga : యానిమల్ ది బలుపా.. వాపా..?

Sandeepreddy Vanga : యానిమల్ ది బలుపా.. వాపా..?

Sandeepreddy Vanga  : యానిమల్ ది బలుపా.. వాపా..?
X

సందీప్ రెడ్డి వంగాది యానిమల్ పై.. కాన్ఫిడెన్సా.. ఓవర్ కాన్ఫిడెన్సా.. బలుపా.. వాపా.. ఇందులో ఏది నిజం అనేది డిసెంబర్ 1న తెలిసిపోతుంది. బట్ ఒక్క విషయంలో మాత్రం వీళ్లది ఓవర్ కాన్ఫిడెన్సే అనిపించడంలో ఆశ్చర్యం లేదు. అదే సినిమా నిడివి. ఈ సినిమా ఏకంగా 3 గంటల 21 నిమిషాలు ఉంది. ఒకప్పటి మన లవకుశ లాంటి సినిమాలు కూడా ఆ రేంజ్ లోనే ఉండేవి. బట్ అప్పుడు రోజులు వేరు. ఇప్పుడలా కాదు. పైగా ట్రైలర్ అంతా వయొలెన్స్ ఉంది. పాటలంత గొప్పగా ఏం లేవు. మనకు బాగా తెలిసిన నటీ నటులూ లేరు. పోనీ ఇవన్నీ ఓకే అనుకున్నా.. ఈ కాలంలో సినిమాను అంతసేపు భరించడం కష్టం. అర్జున్ రెడ్డి కూడా మూడు గంటల సినిమా. అప్పుడూ ఇలాంటి కమెంట్స్ వచ్చాయి. కానీ సినిమా హిట్ అయింది కదా.. అందువల్ల ఇదీ హిట్ అవుతుందనుకుంటే అంతకు మించిన ఫూలిష్ నెస్ మరోటి ఉండదు. అఫ్ కోర్స్ సందీప్ టాలెంట్ తెలిసిన ఎవరూ అలా అనుకోరు కూడా. అయినా యానిమల్ మూవీపై ఎక్కడో కొడుతోందనే కమెంట్స్ దేశవ్యాప్తంగా ఉన్నాయి.

ముఖ్యంగా వయొలెన్స్ నిండిన సినిమాలను అంత సేపు ఎవరూ భరించలేరు. ఎంత బలమైన కంటెంట్ ఉన్నా.. ఇది ఖచ్చితంగా మైనస్ అవుతుంది. దీంతో పాటు కథ పరంగా ఇది సందీప్ రెడ్డికి ద్వితీయ విఘ్నంలాంటిది. తెలుగు నుంచి చాలామంది దర్శకులు రెండో సినిమాతో డిజాస్టర్ చూశారు. సినిమాగా సందీప్ కు ఇది మూడోదే అయినా కథ పరంగా రెండోదే. అదీ తెలుగులో సెంటిమెంట్ గా మారింది. ఇక తండ్రి కొడుకుల నేపథ్యంలో వైల్డ్ గ్యాంగ్ స్టర్ డ్రామా అని చెబుతోన్న ఈ కథ వెండితెరపై రక్తం పారిస్తుంది అనేది మాత్రం ట్రైలర్ తో అర్థమైంది. రణ్ బీర్ కు సౌత్ లో మాస్ లో ఫాలోయింగ్ లేదు. ఉన్న ఫాలోయింగ్ అంతా పెద్ద నగరాల్లోనే ఉంది. అది కూడా యానిమల్ కు కొంత మైనస్ అవుతుంది. వీళ్లు ఎంత ప్రమోషన్స్ చేసినా.. ఆయా భాషల్లోని హీరోలను, దర్శకులను ఎంత కాకా పట్టినా.. ఫైనల్ గా ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించాల్సింది.. సందీప్ తో పాటు,, రణ్ బీర్ మాత్రమే. ఆ సత్తా వీరిలో ఏ స్థాయిలో ఉందనేది డిసెంబర్ 1న తేలుతుంది. బట్ మూడున్నర గంటల ఈ వయొలెన్స్ ను భరించడం అంత సులువైతే కాదేమో..? ఏదేమైనా వీరిది బలుపా వాపా అనేది కూడా అదే రోజు తేలిపోతుంది.. సో వి జస్ట్ వెయిట్ అండ్ సీ..


Updated : 28 Nov 2023 3:47 PM IST
Tags:    
Next Story
Share it
Top