కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న 'సప్తసాగరాలు' బ్యూటీ
X
'సప్తసాగరాలు దాటి' మూవీతో పాపులర్ అయిన కన్నడ భామ చైత్ర ఆచార్ కుర్రాళ్లను నిద్రపోనివ్వడం లేదు. మూవీలో పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఓ రేంజ్‌లో గ్లామర్ ఒలకబోస్తోంది. ఆమెను చూసినవారంతా స్టన్ అవుతున్నారు. అమ్మడి అందాల విందుకు కుర్రాళ్లు పండగ చేసుకుంటున్నారు. తాజాగా ఈ బ్యూటీ కేవలం బ్రాతోనే ఫోటోషూట్ చేసి కుర్రకారులో మరింత హీట్‌ను పెంచింది.
చైత్ర ఆచార్.. సప్తసాగరాలు దాటి సైడ్-బి మూవీలో లిప్‌లాక్‌తో రెచ్చిపోయింది. ఆ తర్వాత చాలా అవార్డు ఫంక్షన్లలో మోడ్రన్ డ్రెస్సులతో తళుక్కుమంటూ మెరుస్తోంది. 2019లో మహిరా అనే మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజుల్లోనే సంగీతం మీద ఇష్టంతో పాటలు కూడా పాడింది. ఇప్పటి వరకూ కేవలం 6 సినిమాల్లోనే నటించింది. ఇక ప్లే బ్యాక్ సింగర్‌గా 10 పాటల వరకూ పాడింది.
సప్తసాగరాలు దాటి సైడ్-బీ, రాజ్ బీ శెట్టి, టోబీ వంటి సినిమాలు చేసి ఒక్కసారిగా ఇండస్ట్రీ టాక్‌గా నిలిచింది. ముఖ్యంగా సప్తసాగరాలు దాటి మూవీలో వేశ్యగా, టోబీ సినిమాలో తండ్రిని కాపాడే ఓ పల్లెటూరి కూతురిగా ఆమె నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడు తన ఫోటోలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. మొత్తానికి ఈ అమ్మడు ఇప్పుడు ఇండస్ట్రీ టాక్‌గా నిలిచింది.