Sapta Sagaralu Dhaati: బ్లాక్బస్టర్ సినిమా.. థియేటర్స్లో ఉండగానే ఓటీటీలోకి
X
తెలుగు సినిమా ఆడియన్స్ కు కంటెంట్ నచ్చితే చాలు.. ఏ భాష అయినా, ఏ హీరో అయినా సినిమా చూస్తారు. హిట్ చేస్తారు. ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో హీరోలను తెలుగు వాళ్లు ఇప్పటికీ ఆదరిస్తున్నారు. తాజాగా కన్నడలో రిలీజ్ అయిన ‘సప్త సాగరదాచె ఎల్లో: సైడ్ ఏ’ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. ఆ సినిమా తెలుగు వెర్షన్ ‘సప్త సాగరాలు దాటి’ సెప్టెంబర్ 22న తెలుగులో రిలీజ్ అయి.. అదే ఊపును కొనసాగిస్తుంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి, రుక్మిణీ వసంత్ జంటగా నటించారు. అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు రిషబ్. ప్రస్తుతం ఈ సినిమా తెలుగులో కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇంతలోనే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచింది.
హేమంత్ ఎం రావు డైరెక్ట్ చేయగా.. పవిత్ర లోకేశ్, అవినాష్, అచ్యుత్ కుమార్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. సింపుల్ లవ్ స్టోరీ అయినా అందరినీ ఆకట్టుకుంది. అన్ని భాషల్లో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో.. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదల చేశారు. కాగా ఈ సినిమాను సీక్వెల్ కూడా త్వరలోనే రాబోతోంది. పార్ట్ వన్‌ను ‘సప్తసాగరాలు దాటి: సైడ్ ఏ’గా రిలీజ్ చేయగా.. సీక్వెల్ ‘సప్తసాగరాలు దాటి: సైడ్ బీ’గా.. అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.