Home > సినిమా > హీరోయిన్లు ఇలా సంపాదిస్తారు.. రీఛార్జ్ చేయడానికి కూడా ఆలోచిస్తారు

హీరోయిన్లు ఇలా సంపాదిస్తారు.. రీఛార్జ్ చేయడానికి కూడా ఆలోచిస్తారు

రూ.400 ఖర్చు చేయలేక.. హాట్ స్పాట్ అడిగిన హాట్ బ్యూటీ

హీరోయిన్లు ఇలా సంపాదిస్తారు.. రీఛార్జ్ చేయడానికి కూడా ఆలోచిస్తారు
X





సాధారణంగా హీరోయిన్లు.. ఖర్చు విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని టాక్. డ్రెస్, షూస్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసేవారితో పాటు.. ఏ చిన్న అవసరానికైనా ప్రొడక్షన్ హౌస్ మీదే ఆధారపడే వాళ్లూ ఉన్నారు. అయితే బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ మాత్రం కేవలం 400 రూపాయల కోసం వెరైటీగా ప్రవర్తించడం హాట్ టాపిక్ అవుతోంది.

ఇటీవలే అబుదాబిలో జరిగిన ఒక అవార్డ్ షో కోసం వచ్చిన సారా అలీ ఖాన్, విక్కీ కౌశల్ హాజరయ్యారు. అయితే ఈ షోలో పాల్గొన్న సారా రూ.400 ఖర్చు చేసేందుకు కూడా నిరాకరించింది. అబుదాబిలో రోమింగ్ ఛార్జీల కోసం రీఛార్జ్‌ చేసుకోవాల్సి వచ్చింది. కానీ సారా అలీ ఖాన్ ఒక్క రోజుకు నాలుగు వందల రూపాయలు ఖర్చు చేయడం ఇష్టం లేక ఇంటర్‌నెట్‌ కోసం పక్కవారిని హాట్‌స్పాట్‌ ఆన్‌ చేయమని అభ్యర్థించినట్లు తెలిపింది.





సారా మాట్లాడుతూ.. 'నా పక్కన ఉన్న వ్యక్తిని రోమింగ్ ప్యాకేజీ ధర గురించి అడిగా. రోమింగ్ ప్యాక్ నెల ప్లాన్ మాత్రమే వస్తుందని చెప్పారు. కానీ నేను అబుదాబిలో ఒకే రోజు ఉండాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత 10 రోజులకు రూ. 3000 ఖర్చవుతుందని తెలుసుకున్నా. నేను కేవలం ఇక్కడ రోజే కదా ఉండేది. పది రోజుల ప్లాన్ ఎందుకనిపించింది. ఆ తర్వాత రోమింగ్ ప్యాక్‌ను రోజుకు రూ. 400కి కొనుగోలు చేయవచ్చని ఎవరో చెప్పారు. కానీ ఒక్క రోజు రూ.400 ఖర్చు చేయడం ఇష్టం లేక నేను నా పక్కవారిని హాట్‌స్పాట్‌ అడిగాను.' అంటూ చెప్పుకొచ్చింది. రూ.400 కు కూడా ఇంతగా ఆలోచించే హీరోయిన్లు.. ఈ చొప్పున పొదుపు చేస్తూ రూ.కోట్లు సంపాదిస్తారు. ఈ సంగతి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ... సారా అలీ ఖాన్ మహా పొదుపరి అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.




Updated : 4 Jun 2023 2:04 PM IST
Tags:    
Next Story
Share it
Top