Home > సినిమా > 'Save The Tigers 2' Trailer : ‘సేవ్ ద టైగర్స్ 2’ ట్రైలర్ వచ్చేసింది? కామెడీ మాములుగా లేదుగా..

'Save The Tigers 2' Trailer : ‘సేవ్ ద టైగర్స్ 2’ ట్రైలర్ వచ్చేసింది? కామెడీ మాములుగా లేదుగా..

Save The Tigers 2 Trailer  : ‘సేవ్ ద టైగర్స్ 2’ ట్రైలర్ వచ్చేసింది? కామెడీ మాములుగా లేదుగా..
X

‘సేవ్ ద టైగర్స్’..కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన డిస్నీప్లస్ హాట్ స్టార్ లో ఆరు ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు నవ్వులను పంచి అందరి మెప్పు పొందింది. ప్రియదర్శి, అభినవ్, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని.. కపుల్స్ గా ప్రధాన పాత్రల్లో నటించారు. అంతేగాక కమెడియన్లు శ్రీకాంత్ అయ్యంగార్, వేణు, రోహిణి.. మరికొంతమంది ముఖ్య పాత్రల్లో నటించారు.





గత ఏడాది సీజన్ 1 సక్సెస్ అవ్వడంతో అప్పుడే సీజన్ 2 ఉంటుందని మేకర్స్ ఎనౌన్స్ చేశారు. కపుల్స్ మధ్య సమస్యలు, ఎమోషన్స్, కామెడి ఆడియన్స్ ను చాలా బాగా ఆకట్టుకుంది. అయితే మళ్లీ ఒకసారి ప్రేక్షకులను అలరించేందుకు సీజన్ 2 సిద్ధమైంది. మార్చ్ 15 నుంచి సేవ్ ద టైగర్స్ సీజన్ 2 డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రిలీజ్ చేసిన సేవ్ ద టైగర్స్ 2 ట్రైలర్ ఫుల్ కామెడీ ఉంది. ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో.. ఈసారి కూడా సీజన్ 2 సిరీస్ ఫుల్ గా ప్రేక్షకులని నవ్వించబోతున్నట్లు అర్థం అవుతోంది. కాగా సేవ్ ద టైగర్స్ లో హీరోయిన్ సీరత్ కపూర్ ఓ ముఖ్య పాత్ర చేసింది. ఈ సిరీస్ కి తేజ కాకుమాను డైరెక్టర్ గా చేశారు.




Updated : 2 March 2024 12:26 PM IST
Tags:    
Next Story
Share it
Top