బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
X
బిగ్ బాస్ హౌసుల్లో జరిగే రచ్చలు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. కంటెస్టెంట్లు ‘స్క్రిప్టెడ్’ గొడవలతో సరిపెట్టుకోకుండా నిజంగానే ఘోరాలకు, నేరాలకు పాల్పడుతున్నాయి. ముఖ్యంగా కన్నడ బిగ్ బాస్ షో సీజన్ 10 పలు వివాదాలకు కారణమవుతోంది. పులి గోరు ధరించిన కంటెస్టెంట్ వర్తుర్ సంతోషన్ పోలీసులు షోలోకి వెళ్లి మరీ అరెస్ట్ చేసి కేసు పెట్టడం తెలిసిందే. ఆ ఉదంతాన్ని మరవక ముందే మరో కంటెస్టెంట్‌పై పోలీసులు ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు.
తనీషా కుప్పంద అనే కంటెస్టంట్ షోలో బోవి(వడ్డెర) అనే ఓ దళిత కులాన్ని కించపరడంతో ఆమెపై బెంగళూరు కుంబలగోడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తనీషాపై చర్యలు తీసుకోవాలలని అఖిల కర్ణాటక బోవి సమాజ్ రాష్ట్ర అధ్యక్షురాలు పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను వెంటనే బిగ్ హౌస్ నుంచి బయటికి పంపాలని కోరారు. తనీషా.. డ్రోన్ ప్రతాప్ అనే కంటెస్టెంట్‌తో గొడవపడి ‘పైకి లేరా వడ్డా’ అంది. దీన్ని చూసిన బోవీ కులస్తులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణ చెప్పకపోతే హౌస్ నుంచి బయటికి వచ్చాక ఆమె సంగతేంటో చూస్తామంటున్నారు. ‘దండు పాళ్య 2’లో నటించిన తనీషాకు నోటి దురుసు ఎక్కువని చెబుతారు.