Home > సినిమా > ప్రముఖ దర్శకుడు శంకర్‌ కూతురికి రెండో పెళ్లి

ప్రముఖ దర్శకుడు శంకర్‌ కూతురికి రెండో పెళ్లి

ప్రముఖ దర్శకుడు శంకర్‌ కూతురికి రెండో పెళ్లి
X

ప్రముఖ దర్శకుడు శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య రెండో పెళ్లికి సిద్దమయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తికేయన్‌తో ఆమె ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని ఐశ్వర్య సోదరి అదితి ఇన్‌స్టాలో ప్రకటించారు. ఎంగేజ్‌మెంట్ ఫోటోలను షేర్ చేశారు. కాగా ఐశ్వర్య 2021లో క్రికెటర్ రోహిత్ దామోదరన్‌ను మ్యారేజ్ చేసుకున్నారు. విభేదాల కారణంగా ఏడాది క్రితం విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని తన సోదరి హీరోయిన్‌ అదితి శంకర్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది. 2021లో క్రికెటర్‌ రోహిత్‌ దామోదరన్‌ను ఐశ్యర్య వివాహం చేసుకుంది. మహాబలిపురంలో ఎంతో ఘనంగా వీరిద్దరి వివాహం జరిగింది. కానీ వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఏడాది క్రితం డైవర్స్ తీసుకున్న విషయం తెలిసిందే. శంకర్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఐశ్వర్య శంకర్ డాక్టర్‌గా కొనసాగుతున్నారు.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న తరుణ్ కార్తికేయన్‌తో తాజాగా నిశ్చితార్థం జరిగింది.

ఇదే విషయాన్ని అదితి శంకర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోర్‌లో వారిద్దరి ఫోటోలు షేర్‌ చేసింది. తరుణ్ కార్తికేయన్ అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే కాదు.. ఆయన పాటల రచయిత, నేపథ్య గాయకుడు కూడా. ఇండస్ట్రీకి దగ్గరగా ఉండే వ్యక్తితోనే ఐశ్వర్య సెకండ్ మ్యారేజ్ చేసుకోనున్నారు. తాజాగా వారి ఎంగేజ్‌మెంట్ జరగడంతో పలువురు సెలబ్రటీలు విషెస్ తెలుపుతున్నారు. త్వరలో మ్యారేజ్ డేట్ శంకర్‌ ప్రకటించనున్నారు. క్రికెటర్‌ రోహిత్ దామోదరన్‌ను 2021లో డాక్టర్ ఐశ్వర్య శంకర్‌ వివాహం చేసుకున్నారు. కొన్ని నెలల్లోనే వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. రోహిత్ దామోదరన్ పోక్సో కేసులో ప్రమేయం ఉన్నట్లు న్యూస్ వచ్చాయి. రోహిత్ నిర్వహిస్తున్న క్రికెట్ కోచింగ్ సెంటర్‌లో మహిళా ఆటగాళ్లతో అసభ్యంగా ప్రవర్తించారని చాలా ఫిర్యాదులు రావడంతో ఆయనపై కేసు నమోదైంది. దీంతో ఐశ్వర్య శంకర్ అతని నుంచి విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఐశ్వర్య తన తండ్రి శంకర్‌తోనే ఉంటోంది. దర్మకుడు శంకర్‌ ప్రస్తుతం ఇండియన్‌ -2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. కమల్‌ హాసన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. మరోవైపు రామ్‌చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ చిత్రాన్ని కూడా శంకర్‌ తెరకెక్కిస్తున్నారు.

Updated : 18 Feb 2024 7:58 PM IST
Tags:    
Next Story
Share it
Top