సలార్ మరో బ్లాస్టింగ్ ట్రైలర్
X
ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ల కొత్త సినిమా సలార్. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ అనే కాంబినేషన్ వల్ల ఈ చిత్రంపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డులను సలార్ చెరిపేస్తుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ప్రశాంత్ నీల్ గత చిత్రం కేజీఎఫ్ లో మదర్ సెంటిమెంట్ ఉంటే.. ఈ సారి ఫ్రెండ్స్ స్టోరీతో వస్తున్నాడు. తన స్నేహితుడి కోసం ప్రాణాలు అడ్డుపెట్టే మరో గొప్ప స్నేహితుడి కథే ఇదని ముందు నుంచీ చెబుతూ వస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ చూస్తే అదే కన్ఫార్మ్ అయిపోయింది.
ప్రమోషన్స్ పరంగా సలార్ టీమ్ నుంచి ఆశించినంత స్టఫ్ రావడం లేదు. ప్రభాస్, పృథ్వీరాజ్, ప్రశాంత్ నీల్ తో కలిపి రాజమౌళి ఒక కామన్ ఇంటర్వ్యూ చేశాడు. దీంతో పాటు ఇతర టెక్నీషియన్స్ కూడా కామన్ ఇంటర్వ్యూస్ తోనే రాబోతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండకపోవచ్చు అనేది ప్రస్తుతానికి తెలుస్తోన్న విషయం. ఇక లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ మూవీ నుంచి ఆదివారం రోజున మరో బ్లాస్టింగ్ ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత డబుల్ అవుతాయని చెబుతున్నారు. మరి ఈ సారి ఎలాంటి ట్రైలర్ తో వస్తారో కానీ.. మెల్లగా సలార్ పై క్రేజ్ స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు.