విశాల్ విషయంలో అది మాత్రం ఎప్పటికీ జరగదు..అబ్బాస్
X
90 కిడ్స్‌కు చాక్లెట్ బాయ్ అబ్బాస్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, విలన్‌గా అప్పట్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు అబ్బాస్. ముఖ్యంగా అబ్బాస్ కటింగ్ ఫేమస్ అయ్యింది కూడా హీరో వల్లే. ప్రేమ్ దేశం సినిమా అప్పట్లో కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. ఈ మూవీ సెన్సేషనల్ హిట్ కావడంతో అబ్బాస్‌కు ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చేసింది. ఇదే మూవీని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అబ్బాస్ చేసి ప్రేక్షకుల హృదయాలను దోచేశాడు. అమ్మాయిల కలల రాకుమారుడు మారాడు. రాజహంస, రాజా, నీ ప్రేమకై, అనగనగా ఒక అమ్మాయి, కృష్ణబాబు, శ్వేతనాగు, నరసింహ, అనసూయ ఇలా దాదాపు 50 సినిమాల్లో అబ్బాస్ నటించాడు. కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్నప్పుడే ఎందుకో ఏమో 2015 నుంచి ఆయన ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్ వెళ్లిపోయారు. అక్కడ మొదట్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాడు. ఎట్టకేలకు చాలా ఏళ్ల తరువాత ఓ కన్స్ట్రక్షన్ కంసెపీలో స్థిరపడ్డాడు. అయితే రీసెంట్గా
చెన్నై వచ్చిన అబ్బాస్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలు మీడియా సంస్థలు ఆయన్ని ఇంటర్వ్యూ చేయగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో విశాల్‌కు తనకు మధ్య జరిగిన ఓ గొడవ గురించి మొదటిసారిగా స్పందించారు.
ఓ ఇంటర్వ్యూలో అబ్బాస్ మాట్లాడుతూ..." విశాల్‌పై నాకు ఎలాంటి పగ లేదు. కానీ, కోపం మాత్రం ఒకప్పుడు ఉండేది. నాతో విశాల్ చలా దారుణంగా ప్రవర్తించాడు. అలా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు. అయినా అతని తప్పును నేను ఎప్పుడో క్షమించాను. ఇప్పుడు కూడా విశాల్ నాకు కనిపిస్తే పలకరిస్తాను. కానీ, క్లోజ్‌గా మాత్రం ఉండలేను. నిజానికి ఇండస్ట్రీలో అందరినీ కలివిడిగా ఉండాలి. కానీ ,విశాల్ విషయంలో మాత్రం అది ఎప్పటికి జరగదు. ఇండస్ట్రీలోని నటులందరినీ ఒకేతాటిపైకి తీసుకువచ్చేందుకే సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌ను స్టార్ట్ చేశారు. కానీ రెండవ సీజన్లో విశాల్ నాగురించి తప్పుగా చెప్పేవాడు. తన మాటలతో ఇతరులను కూడా పాడు చేశాడు. అలాంటి వాతావరణంలో నేను అస్సలు ఉండాలనుకోలేదు. దీంతో చేసేదేమిలేక నేనే వెనక్కి తగ్గాను. ఆరోజు నా లైఫ్ లో మరిచిపోను. నేను ఎంతో బాధపడ్డాను. అయితే ఆ తరువాత విశాల్ కూడా బాధపడి ఉంటాడని అనుకుంటున్నాను. " అని అబ్బాస్ తెలిపారు.