Home > సినిమా > లేటు వయసులో సీనియర్ నటుడి హనీమూన్..నెటిజన్స్ ట్రోలింగ్

లేటు వయసులో సీనియర్ నటుడి హనీమూన్..నెటిజన్స్ ట్రోలింగ్

లేటు వయసులో సీనియర్ నటుడి హనీమూన్..నెటిజన్స్ ట్రోలింగ్
X

సీనియర్ నటుడు ఆశిష్‌ విద్యార్థి గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. దక్షిణాదితో పాటు ఉత్తరాదిన మంచి నటుడిగా గుర్తింపు పొందారు ఈయన. 11 భాషల్లో ఏకంగా 200కిపైగా సినిమాల్లో నటించారు. తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. పోకిరి సినిమాతో టాలీవుడ్‎లో ఎంట్రీ ఇచ్చారు ఆశిష్. ఈ సినిమా హిట్ కావడంతో పాటు ఆశిష్ కారెక్టర్ కూడా అందరికి కనెక్ట్ అయ్యింది. నెగిటివ్ షేడ్ పాత్రలతో బాగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం సినిమాలతో పాటు తన ఓన్ ఫుడ్ యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తున్నారు. అయితే ఈ మధ్యనే





ప్రేమకు వయసుతో సంబంధం లేదని 57ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు ఆశిష్ విద్యార్థి. తనకంటే 24 ఏళ్ల చిన్నదైన అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌ రూపాలిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పటికే మొదటి భార్యకు ఓ కుమారుడు కూడా ఉన్నారు. కోల్‌కతాలో జరిగిన వీరి పెళ్లికి అత్యంత సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు.





అయితే తాజాగా ఈ జంట తమ హనీమూన్ ట్రిప్‌లో ఉన్నారు. ఇండోనేషియాలో బాలిలో ఈ జంట ఎంజాయ్ చేస్తోంది. అందమైన ప్రదేశాలను చుడుతూ అక్కడి వీధుల్లో చక్కర్లు కొడుతుతున్నారు. వీరి వెకేషన్ కు సంబంధించిన పిక్స్ ను రూపాలి తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. గ్రీనరీ , ఆహ్లాదకరమైన కొండల మధ్య దిగిన ఫోటోను పంచుకుంది. జూన్ నెలలో కూడా ఈ జంట సింగపూర్‌లో విహారయాత్రకు వెళ్లింనట్లు టాక్. ఇదిలా ఉంటే లేటు వయసులో పెళ్లి చేసుకోవడంతో ఆశిష్‎ను నెటిజన్స్ ట్రోల్స్‌ చేస్తున్నారు. ఈ వయసులో ఇది అవసరమా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.











Updated : 11 July 2023 3:07 PM IST
Tags:    
Next Story
Share it
Top