రానా, తేజ మూవీలో రాజశేఖర్
X
రానాతో నేనే రాజు నేనే మంత్రి తీసి హిట్ కొట్టిన తేజ ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమాకు సిద్ధమవుతున్నాడు. దీనికి రాక్షసరాజు అనే పేరును కూడా ప్రకటించాడు. తాజాగా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం సీనియర్ నటుడు రాజశేఖర్ ను తీసుకుంటున్నట్టు సమాచారం.
టాలీవుడ్ లో మరో మల్టీస్టారర్ రాబోతోంది. ఈ మల్టీస్టారర్ కి తేజ దర్శకుడుగా ఉండనున్నాడు. దగ్గుబాటి సురేష్ రెండో కొడుకు అభిరామ్ తో తీసిన అహింస సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు తేజ, సురేష్ బాబు పెద్ద కుమారుడు, నటుడు రానా దగ్గుబాటి తో రాక్షస రాజు అనే సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం డాక్టర్ రాజశఏకర్ ను తీసుకున్నారని తెలుస్తోంది. తేజ ఆల్రెడీ ఆయనతో మాట్లాడారని....రాజశేఖర్ కూడా ఒప్పుకున్నారని సమాచారం. రెండు , మూడు రోజుల్లో ఈ విషయాన్ని ప్రకటిస్తారని చెబుతున్నారు.
రాజశేఖర్ దాదాపు సినిమాలు చేయడం తగ్గించేశారు. గరుడ వేగ తర్వాత వచ్చిన ఆయన సినిమాలు ఏవీ హిట్ అవలేదు. అంతేకాదు ఇప్పుడు రాక్షసరాజులో చేయడం కనుక ఫైనల్ అయితే రాజశేఖర్ చాలాకాలం తర్వాత మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నట్టు అవుతుందని అంటున్నారు. ఈ సినిమాలో రానాకు అన్నయ్యగా ఆయన వేయొచ్చని యూనిట్ సభ్యుడు ఒకరు చెబుతున్నారు.