Home > సినిమా > 31 సినీ కెరీర్ లో లేనిది...ఇప్పుడు వెబ్ సీరీస్ కోసం చేసింది

31 సినీ కెరీర్ లో లేనిది...ఇప్పుడు వెబ్ సీరీస్ కోసం చేసింది

31 సినీ కెరీర్ లో లేనిది...ఇప్పుడు వెబ్ సీరీస్ కోసం చేసింది
X

మూడు దశాబ్దాల కెరియర్...చేసినవన్నీ పెద్ద రోల్స్...హీరోయిన్ గా పీక్స్ చూసిన నటి....కానీ ఒక్క ముద్దు కూడా లేదు. బాలీవుడ్ నల్లకళ్ళ పిల్ల, సీనియర్ నటి కాజోల్ 31 ఏళ్ళల్లో ఎప్పుడ చేయని పనిని ఇప్పుడు చేసింది.

1992లో సినిమాల్లోకి వచ్చిన కాజోల్ ఒకప్పుడు టాప్ హీరోయిన్. అందరు పెద్ద స్టార్లతోనూ నటించింది. పొట్టి డ్రెస్ లూ వేసుకున్నా ఎప్పుడూ హద్దుదాటి నటించలేదు. ముద్దు సన్నివేశాలు అసలే లేవు. కానీ ఇప్పుడు అది కూడా చేసేసింది. అజయ్ దేవగన్ ను పెళ్ళిచేసుకుని కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. సినిమాల్లో కీ రోల్స్ తో, క్యరెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. ఇప్పుడు వెబ్ సీరీస్ లతో బిజీగా మారింది. లస్ట్ స్టోరీస్ 2 లో నటించింది. తాజాగా కాజోల్ నటించిన ది ట్రయల్ వెబ్ సీరీస్ రిలీజ్ అయింది.

ది ట్రయల్ లో కాజోల్ రోలే పెద్దది. తన భర్త లంచం లైంగిక వేధింపుల కుంభకోణం లో చిక్కుకున్న తర్వాత తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోరాడే తల్లి గురించిన కథ ఇది. ఆమె తన కుటుంబ అవసరాల ను తీర్చుకోవడానికి ఒక లా ఫర్మ్ లో చేరవలసి వస్తుంది. అక్కడ తన పాత కాలేజీ లవర్ ను కలవడం...వాళ్ళిద్దరూ ముద్దుపెట్టుకోవడం జరుగుతుంది. అప్పుడే అక్కడే కాజోల్ లిప్ లాక్ సన్నివేశంలో నటించింది. అలీఖాన్ అనే నటుడితో ఈ సన్నివేశాల్లో పాల్గొంది.

ఓ ఇంటర్వ్యూలో కాజోల్ తో తన ముద్దు సన్నివేశం గురించి అలీ ఖాన్ ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు. నా చిన్న తనం లో నా అభిమాన నటీమణుల్లో ఒకరు కాజోల్. నేను మూడు దశాబ్దాలుగా తన నటనను చూస్తూనే ఉన్నాను. ముంబై లోని ఒక ఖరీదైన హోటల్ లో ముద్దు సన్నివేశం షూటింగ్ చేశాము. మాకు క్లోజ్డ్ సెట్ కావాలా అని దర్శకుడు అడిగారు. నేను ముద్దు పెట్టుకునే ముందు దర్శకుడిని కాజోల్ తో మాట్లాడాను. కానీ ఒక్క సెక ను కూడా ఎటువంటి ఇబ్బంది లేదా సంకోచం లేకుండా ఆ సన్నివేశం పూర్తయింది.. అని చెప్పుకొచ్చాడు. ఇది చాలా ప్రొఫెషనల్ షూట్. ముద్దు సన్నివేశాన్ని మూడు నాలుగు సార్లు రిహార్సల్ చేసాం. ప్రతిసారీ మేము మానిటర్ల వద్దకు వెళ్లి హ్యాపీనా అని అడిగాము. చివరికి ఓకే అయింది.. అని తెలిపారు.

Updated : 15 July 2023 11:49 AM IST
Tags:    
Next Story
Share it
Top