ఆ ముద్దు నచ్చలే.. అందుకే డెటాల్‌తో నోరు కడుకున్నా: బాలీవుడ్ నటి
X
తమన్నా, మృణాల్ ఠాకూర్, విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2. ఈ సిరీస్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది సీనియర్ నటి నీనా గుప్తా. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన ఆన్ స్క్రీన్ ఫస్ట్ కిస్ గురించి వివరించారు. ఆ ముద్దు సీన్ పూర్తయిన తర్వాత డెటాల్ తో నోరు కడుకున్నా అని చెప్పారు.
‘ఒక యాక్టర్ గా అన్ని రకాల సీన్స్ లో నటించాల్సి ఉంటుంది. కొన్ని సార్లు బురదలో దిగాలి. ఇంకొన్నిసార్లు ఎండలో కష్ట పడాలి. డైరెక్టర్ చెప్పిన సీన్లకు నో చెప్పకుండా నటించాలి. మనకున్న మొహమాటాన్ని పక్కనబెట్టాలి. దిలీప్ ధావన్‌తో నేనొక సీరియల్ లో నటించా. అందులో ఓ సీన్ లో లిప్ కిస్ పెట్టుకోవాలి. ఇండియన్ టెలివిజన్ చరిత్రలో అదే మొదటి ముద్దు సీన్. ధావన్ చూడ్డానికి బాగా ఉంటాడు. అందరికీ నచ్చుతాడు. కానీ, ఆ సీన్ లో నటించాక.. డెటాల్ తో నోరు కడుకున్నా. రాత్రంతా నిద్ర పట్టలేదు. ఆ టైంలో మానసికంగా, శారీరకంగా సిద్ధంగా లేకున్నా సీన్ లో నటించా. అది నాకు నచ్చలేదు. అన కంఫర్ట్ గా ఫీల్ అయ్యా. కెమెరా ముందు అందరూ అన్నీ చేయలేరు కదా. ఆ టైంలో నాకెంతో కష్టంగా అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చింది.