Vijayashanthi : హీరో విజయ్కి విజయశాంతి సపోర్టు.. ఏ విషయంలో అంటే?
X
తమిళ హీరో విజయ్ సేతుపతికి సీనియర్ నటి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి బాసటగా నిలిచారు. తమిళనాట హిందీ చదువుకోకూడదని తాము ఎవరికీ చెప్పట్లేదని, కానీ తమ నెత్తిమీద బలవంతంగా హిందీని రుద్దకూడదని మాత్రమే తెలియజేస్తున్నామంటూ హీరో విజయ్ సేతుపతి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై హిందీ భాషా పండితులు, నార్త్ ఇండియాకి చెందిన పలువురు రాజకీయ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయశాంతి స్పందించారు. విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని అన్నారు. హిందీ భాషపై ఆయన చేసిన ప్రకటనన సమంజసం, సమర్థనీయమని అన్నారు. ఈ విషయంలో విజయ్ సేతుపతి చూపిన తెగువ ప్రశంసనీయమని అన్నారు. ద్రవిడ, దక్షిణాది భావోద్వేగాలు తమకు తప్పక గౌరవనీయమని తెలిపారు. జాతీయస్థాయిలో కూడా దక్షిణ భారత భావాలను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఫెడరల్ వ్యవస్థకు, కేంద్ర ప్రభుత్వానికి తప్పక ఉండి తీరాలని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా తమిళనాడు మంత్రి, హీరో ఉదయ్ నిధి స్టాలిన్ కూడా గతంలో హిందీపై ఇలాంటి కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.