Home > సినిమా > సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం..సెంథిల్ భార్య మృతి

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం..సెంథిల్ భార్య మృతి

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం..సెంథిల్ భార్య మృతి
X

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి, యోగా టీచర్ రూపా తూది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూనే గురువారం తుది శ్వాస విడిచారు. అంత్యక్రియలు శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి. శరీరంలోని అనేక అవయవాలు దెబ్బతినడంతో.. కిమ్స్ హాస్పిటల్ లో మరణించారు. రేపు ఉదయం 9 గంటలకు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ వార్త ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులను బాధకి గురి చేస్తుంది. ముఖ్యంగా రాజమౌళి కుటుంబసభ్యులను ఈ విషయం బాగా బాధిస్తుంది. ఎందుకంటే, రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి, యమదొంగ, మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు సెంథిల్ కెమెరా నుంచి పుట్టినవే. రాజమౌళి విజన్ ని సెంథిల్ బాగా అర్ధం చేసుకొని, ఆడియన్స్ కి స్క్రీన్ పై గొప్పగా చూపిస్తారు. ఇక ఆయన వర్క్ కు ఎన్నో అవార్డులు అందుకున్నాడు. ఇంత చిన్న వయస్సులోనే ప్రేమించే భార్యను పోగొట్టుకోవడం ఎంతో పెద్ద విషాదమని చెప్పాలి. ఈ జంటకు ఇద్దరు కుమారులు. ఆయనకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పుకొస్తున్నారు. రూహీ మరణం పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. సెంథిల్ కుమార్‌ భార్యకు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.




Updated : 15 Feb 2024 8:37 PM IST
Tags:    
Next Story
Share it
Top