Home > సినిమా > టాలీవుడ్‌లో వరుస విషాదాలు..ప్రముఖ నిర్మాత మృతి!

టాలీవుడ్‌లో వరుస విషాదాలు..ప్రముఖ నిర్మాత మృతి!

టాలీవుడ్‌లో వరుస విషాదాలు..ప్రముఖ నిర్మాత మృతి!
X

టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. పలు కారణాల వల్ల నటీనటులు, టెక్నీషియన్లు మరణిస్తున్నారు. తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. నిర్మాత, రచయిత వి.మహేష్ గుండెపోటుతో మరణించారు. 85 ఏళ్ల మహేష్ తన సినీ కెరీర్‌లో సీనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, సుమన్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు. చెన్నైలోని తన ఇంటి బాత్రూమ్‌లో కాలుజారి కిందపడ్డారు.

కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మహేష్ గుండెపోటుతో మరణించినట్లుగా వైద్యులు చెప్పారు. మహేష్ మరణం పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలిపారు. నిర్మాత మహేష్ కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. 1975లో 'మాతృమూర్తి' సినిమాతో మహేష్ నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన నిర్మాణ సారధ్యంలో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కాయి.

సీనియర్ ఎన్టీఆర్‌తో మనుషులంతా ఒక్కటే, మహాపురుషుడు వంటి సినిమాలు చేశారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సింహపురి సింహం, సుమన్‌తో ముసుగు దొంగ వంటి సినిమాలను నిర్మించారు. ఎన్టీఆర్‌తో తీసిన మనుషులంతా ఒక్కటే చిత్రానికి గాను ఉత్తమ కథా రచయితగా ఆయన నంది అవార్డును అందుకున్నారు. అలాగే శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌లో ప్రసారమైన 'హరి భక్తుల కథలు' సీరియల్‌కు రైటర్ కమ్ ప్రొడ్యూసర్‌గా చేశారు. ఏపీలోని నెల్లూరు జిల్లా కొరుటూరు గ్రామానికి చెందిన మహేష్ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోయారు. నిర్మాత మహేష్ మృతిపట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.

Updated : 26 Feb 2024 5:31 PM IST
Tags:    
Next Story
Share it
Top