Home > సినిమా > కొలువుదీరిన బాల రాముడు.. ప్రాణ ప్రతిష్ఠకు హాజరైన సెలబ్రిటీలు..

కొలువుదీరిన బాల రాముడు.. ప్రాణ ప్రతిష్ఠకు హాజరైన సెలబ్రిటీలు..

కొలువుదీరిన బాల రాముడు.. ప్రాణ ప్రతిష్ఠకు హాజరైన సెలబ్రిటీలు..
X

అయోధ్య నగరి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రామ నామస్మరణతో మార్మోగుతోంది. బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. బాలీవుడ్, టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్, రణ్ బీర్ కపూర్ - ఆలియా భట్, ఆయుష్మాన్ ఖురానా తదితరులు ఉదయమే ఆలయం వద్దకు చేరుకున్నారు.

అమితాబ్ తెలుపు రంగు కుర్తా - పైజామాలో అభిషేక్ బచ్చన్తో కలిసి అయోధ్య రామయ్య దర్శనానికి వచ్చారు.

బాలీవుడ్ కపుల్ రణ్ బీర్ కపూర్ - ఆలియా భట్, విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ దంపతులు సైతం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యారు. బాలీవుడ్ నటులు ఆయుష్మాన్ ఖురానా, వివేక్ ఒబెరాయ్, మాధురి దీక్షిత్, మధుర్ బండార్కర్, రాజ్ కుమార్ హిరానీ, రోహిత్ శెట్టి తదితరులు సంప్రదాయ దుస్తుల్లో అయోధ్య రామయ్య దర్శనానికి వచ్చారు.

టాలీవుడ్ నటులు సైతం అయోధ్యకు వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాం చరణ్ బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యేందుకు అయోధ్యకు చేరుకున్నారు. వారు కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అయోధ్యకు వెళ్లారు.

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, ధనుష్ తదితరులు సైతం అయోధ్యలో జరిగుతున్న మహా క్రతువుకు హాజరయ్యారు. రాముల వారిని దర్శించుకున్నారు.

Updated : 22 Jan 2024 12:58 PM IST
Tags:    
Next Story
Share it
Top