Home > సినిమా > రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో మోగిన పెళ్లి బాజాలు

రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో మోగిన పెళ్లి బాజాలు

రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో మోగిన పెళ్లి బాజాలు
X

టాలీవుడ్ స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లిసందడి నెలకొంది. రాహుల్ తమ్ముడు నిఖిల్ సిప్లిగంజ్ వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, తలసానితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఇవీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ సింగర్ గా, బిగ్ బాస్ విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ అందరికీ సుపరిచితుడే. ఆర్ఆర్ఆర్ సినిమాలో సూపర్ హిట్టైన నాటు నాటు పాటను రాహుల్ పాడాడు. ఈ పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ స్టేజిపై నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు. ఇలా హైదరాబాద్‌లోని బస్తీ నుంచి ప్రపంచం మెచ్చేస్థాయికి రాహుల్ సిప్లిగంజ్ ఎదిగాడు.

Updated : 5 Jun 2023 10:40 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top