Shah Rukh Khan: జవాన్ కలెక్షన్ల సునామీ.. చరిత్ర సృష్టించిన షారుఖ్
X
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ 'జవాన్' సినిమాతో హిస్టరీ క్రియేట్ చేశారు. ఆయన నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జవాన్’.. విడుదలైన 18 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ లో చేరి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అట్లీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు నుంచే వసూళ్ల వేట ప్రారంభించి, మూడో వారంలోనూ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పటికే ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన ఈ మూవీ, తాజాగా మరో ఫీట్ సాధించింది. ‘జవాన్’ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 1004.92 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ సోమవారం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. కేవలం హిందీలోనే రూ. 505.94 కోట్లు రాబట్టి, ఆల్ టైం మెగా హిట్ గా నిలిచినట్లు పేర్కొన్నారు.
వెయ్యి కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన 6వ భారతీయ చిత్రంగా 'జవాన్' నిలిచింది. దీని కంటే ముందు 'దంగల్', 'బాహుబలి 2', 'RRR', 'KGF 2' 'పఠాన్' చిత్రాలు ఈ ఘనత సాధించాయి. ఈ ఏడాది జనవరి 25న ఖాన్ నటించిన 'పఠాన్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు 'జవాన్' మూవీతో మరోసారి అదే మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చెయ్యడంతో కింగ్ ఖాన్ పేరిట పలు సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఒకే ఏడాదిలో రెండు 1000 కోట్ల గ్రాస్ సినిమాలు కలిగిన మొట్ట మొదటి ఇండియన్ హీరోగా SRK నిలిచాడు. అంతేకాదు ఒకే ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ 2 ఆల్ టైమ్ గ్రాసర్స్ కలిగిన ఏకైక ఇండియన్ యాక్టర్ గా షారుక్ చరిత్ర సృష్టించాడు. మరోవైపు ఈ సినిమాతో వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన తొలి తమిళ దర్శకుడిగా అట్లీ నిలిచాడు.
ఈ సినిమాలో షారుక్‌కు జోడీగా సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార నటించారు. ఈ సినిమాలో ఆమె ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపించారు. ఇక విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషించగా.. దీపిక పదుకొణె, సంజయ్ దత్ స్పెషల్ రోల్స్ లో కనిపించారు. సీనియర్ నటి ప్రియమణి, యోగి బాబు, రిద్ధి దోగ్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణె గెస్ట్ రోల్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. రాక్ స్టార్ అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు.ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబరు చివర్లో లేదా నవంబరు మెుదటి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
History in the maKING ft. Jawan! 🔥
— Red Chillies Entertainment (@RedChilliesEnt) September 25, 2023
Have you watched it yet? Go book your tickets now! https://t.co/B5xelU9JSg
Watch #Jawan in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/rhJSF0vdsw