Jawan 1st day collections: కలెక్షన్ల సునామీ.. అన్ని రికార్డులు బద్దలు
X
2023 బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ కు కలిసొచ్చింది. గత నాలుగేళ్లుగా సతమతమవుతున్న షారుఖ్ కు వరుస హిట్ లు కొడుతూ సత్తా చాటుతున్నాడు. ఈ ఏడాది రిలీజ్ అయిన పఠాన్ సినిమా రూ.1000 కోట్లు కొల్లగొట్టింది. పఠాన్ కు మొదటి రోజు కలెక్షన్స్ రూ.75 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్లు రాబట్టింది. ఇప్పుడు జవాన్ సినిమాతో మళ్లీ బాలీవుడ్ సింహాసనం తనదేనని మరోసారి నిరూపించాడు షారుఖ్. సెప్టెంబర్ 7 రిలీజ్ అయిన జవాన్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల సేనామీని క్రియేట్ చేసింది.
జవాన్ విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్ల గ్రాస్, దేశంలో రూ.70 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. రీసెంట్ గా రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన జైలర్ సినిమాకు తొలిరోజు కలెక్షన్లు దాదాపు రూ. 45 కోట్లు వచ్చాయి. కాగా, ఆ రికార్డ్ ను జవాన్ తుడిపేసింది. ఈ స్థాయి నెట్ కలెక్షన్లు రావడం దేశంలోనే తొలిసారని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. గతంలో పఠాన్ తర్వాత (57 కోట్లు), కేజీఎఫ్2(రూ.53.95 కోట్లు), వార్ (రూ. 53.35 కోట్లు), థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ (రూ.52.25 కోట్లు), జైలర్ (రూ.44.50 కోట్లు), బాహుబలి2(రూ.41 కోట్లు) సాధించాయి.