Home > సినిమా > షారుఖ్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. అమెరికాలో ప్రమాదం

షారుఖ్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. అమెరికాలో ప్రమాదం

షారుఖ్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. అమెరికాలో ప్రమాదం
X

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ గురించి ఓ షాకింగ్ న్యూస్ వస్తోంది. ఓ మూవీ షూటింగ్ సమయంలో ఆయనకు ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఇటీవల షూటింగ్ నిమిత్తం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కు వెళ్లిన కింగ్ ఖాన్.. అక్కడ షూటింగ్ స్పాట్ లో ప్రమాదానికి గురయ్యారట. ఈ ప్రమాదంలో ఆయన ముక్కుకు గాయమైందని, అమెరికాలోనే సర్జరీ జరిగిందని తెలిసింది. ప్రస్తుతం ఇండియాకు తిరిగొచ్చిన షారుక్.. ముక్కుకు కట్టుతోనే కనిపించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడని చెబుతున్నారు. అయితే ప్రమాదం ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టత లేదు.





ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం... ఎస్ఆర్‌కే(షారుక్ ఖాన్) ఓ ప్రాజెక్ట్ కోసం లాస్ ఏంజిల్స్‌లో షూటింగ్ చేస్తున్నాడని, ఆ సమయంలోనే ముక్కుకు గాయమైందని తెలిపారు. రక్తస్రావం కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. దీనిపూ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం షారుక్‌ అట్లీ దర్శకత్వంలో ‘జవాన్‌’లో (Jawan) నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. షారుక్‌ సరసన నయనతార నటిస్తోన్న ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, సన్యా మల్హోత్రా, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ దీపికా పదుకొణె అతిథి పాత్రలో కనిపించనుంది. అలాగే రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో ‘డుంకీ’(Dunki)లోనూ షారుక్‌ ఖాన్‌ నటిస్తున్నారు.

Updated : 4 July 2023 2:35 PM IST
Tags:    
Next Story
Share it
Top