Home > సినిమా > గుంటూరు కారంతో మహేష్ యాక్షన్.. అదిరిన షారుఖ్ రియాక్షన్

గుంటూరు కారంతో మహేష్ యాక్షన్.. అదిరిన షారుఖ్ రియాక్షన్

గుంటూరు కారంతో మహేష్ యాక్షన్.. అదిరిన షారుఖ్ రియాక్షన్
X

సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూవీ గుంటూరు కారం. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాక్తో దూసుకెళ్తోంది. ఫస్ట్ రోజు రికార్డ్ కలెక్షన్స్తో ఈ మూవీ దుమ్మురేపింది. మహేష్ మాస్ షో అంటూ ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. ఈ మూవీపై బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ స్పందించారు. గుంటూరు కారం సినిమా మాస్ రైడ్ అంటూ ట్వీట్ చేశారు. ‘‘గుంటూరు కారం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను మై ఫ్రెండ్ మహేష్. యాక్షన్, ఎమోషన్, మాస్ కలగలిపిన సూపర్ రైడ్ ఇది. ముట్టుకుంటే నిప్పే’’ అంటూ షారుఖ్ ట్వీట్ చేశారు. దీనికి గుంటూరు కారం ట్రైలర్ను జత చేశారు.

గుంటూరు కారంపై షారుఖ్ చేసిన నెట్టింట వైరల్గా మారింది. బాద్ షా రియాక్షన్ పై మహేష్ ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. కాగా షారుఖ్ సినిమాలపై కూడా మహేష్ స్పందిస్తుంటాడు. గతంలో రిలీజైన షారుఖ్ జవాన్ సినిమాను మహేష్ ప్రత్యేకంగా అభినందించారు. దానికి షారుఖ్ సైతం థ్యాంక్స్ చెప్పారు. కాగా మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా గుంటూరు కారం దూసుకెళ్తోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించగా.. థమన్ సింగీతం అందించారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జయరాం, వెన్నెల కిశోర్, మురళీశర్మ, జగపతిబాబు, సునీల్, ఈశ్వరీ రావు వంటి నటులు కీలక పాత్రలు పోషించారు.

Updated : 14 Jan 2024 8:29 AM IST
Tags:    
Next Story
Share it
Top