Home > సినిమా > Jawan Review: ‘జవాన్’ ప్రీమియర్ రివ్యూ.. ఆట్లీ సినిమాలో ఏదీ వదల్లేదుగా!

Jawan Review: ‘జవాన్’ ప్రీమియర్ రివ్యూ.. ఆట్లీ సినిమాలో ఏదీ వదల్లేదుగా!

Jawan Review: ‘జవాన్’ ప్రీమియర్ రివ్యూ.. ఆట్లీ సినిమాలో ఏదీ వదల్లేదుగా!
X

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం జవాన్. లేడీ సూపర్ స్టార్స్ నయనతార, దీపిక పదుకునే, విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ తో భారీ అంచనాలు పెంచింది. పఠాన్ హిట్ తర్వాత షారుఖ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఓ రేంజ్ లో బజ్ ఏర్పడింది. మరి సినిమా అంతటి భారీ అంచనాల్ని సినిమా అందుకుందా? కింగ్ ఖాన్ మరో విజయాన్ని సాధించాడా? అట్లీ మ్యాజిక్ ఎంతవరకు పని చేసిందో చూద్దాం.

భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో షారుఖ్ డ్యూయెల్ రోల్ లో నటించాడు. విక్రమ్ రాథోర్, ఆజాద్ రాథోర్ అనే పాత్రల్లో అద్భుతశమైన పర్ఫామెన్స్ ఇచ్చి మెప్పించాడు. ముఖ్యంగా అయన గెటప్స్ ఫ్యాన్స్ కి విశేషంగా నచ్చుతాయి. షారుఖ్ మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమాలో రచ్చ చేశాడు. ఉద్వేగభరితమైన సన్నివేశాలు, యాక్షన్ సీన్లు ఇందులో ప్లస్ పాయింట్స్. ప్రతి సీన్ మెప్పిస్తుంది. ఇక షారుఖ్ కు దీటుగా నయనతార పవర్ ప్యాక్డ్ యాక్షన్ తో దుమ్ములేపింది. కింగ్ ఖాన్ తో నయనతార కెమిస్ట్రీ బాగుంది. ఇద్దరు కలిసి యాక్షన్ సీన్స్ తో ఇరగదీశారు. విలన్ పాత్ర పోషించిన విజయ్ సేతుపతి కూడా ఇరగొట్టాడు. యాక్షన్, కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్లో విజయ్ యాక్టింగ్ కు ఫిదా కావాల్సిందే.





దీపికా పదుకొణె క్యామియో అప్పియరెన్స్ ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ అట్లీ అన్ని అంశాలని కవర్ చేస్తూ సినిమాను అద్భుతంగా తెరకెకెక్కించాడు. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు.. అదిరిపోయే థ్రిల్లింగ్ అంశాలను సరికొత్తగా చూపించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కు ఆడియెన్స్ ఫిదా అవడం ఖాయం. యాక్షన్ సీన్స్ తో ఆడియన్స్ ను కనురెప్ప వాల్చకుండా చేశాడు.యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా సినిమా మెప్పిస్తుంది. థ్రిల్, ట్విస్టులు, సస్పెన్స్ తో సినిమా మొత్తం అలరిస్తుంది. బిగ్గెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో పాటు.. మరో మూడు, నాలుగు గూస్ బంప్స్ మూమెంట్స్ సినిమాపై ఉన్నఅంచనాలను రీచ్ అయ్యేలా చేసింది.

వాటితోపాటు అనిరుధ్ అందించిన మ్యూజిక్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో థియేటర్లు బద్దలయ్యాయి. ముఖ్యంగా ‘జిందా బందా హ’ పాటకు ఆడియెన్స్ ఊగిపోయారు. అద్భుతమైన కథతోపాటు స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్. సినిమాలో యాక్టర్లంతా షారుక్ ఖాన్ తో పోటీపడి మరి నటించారు. మొత్తంగా సినిమా ఆడియెన్స్ ని విశేషంగా ఆకట్టుకునేలా ఉంది.




Updated : 7 Sept 2023 11:34 AM IST
Tags:    
Next Story
Share it
Top