ఒక్క పాటకు రూ.15 కోట్లు..1000 మంది లేడీ డ్యాన్సర్లు
X
పఠాన్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ తరువాత బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మంచి ఊపుమీద ఉన్నాడు. జవాన్ సినిమాతో వెండితెరపై మరోసారి సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. త్రీ వీక్స్ బ్యాక్ విడుదలైన ట్రైలర్ జవాన్‌పై అంచనాలను భారీగా పెంచేసింది. బాలీవుడ్ నాట ఈ సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయంగా తెలుస్తోంది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని షారుఖ్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ట్రైలర్‌ను బట్టి పఠాన్‌కు మించి ఈ సినిమా ఉండబోతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది పక్కా షారుఖ్‌కు మరో వెయ్యి కోట్ల బొమ్మ అని స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. నిజానికి పఠాన్ సినిమాలో మ్యాటర్ పెద్దగా లేకపోయినా ఒక్క షారుఖ్ క్రేజ్‌తోనే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద కోట్లను కొల్లగొట్టింది. ఇక ఇప్పుడు ఆ క్రేజ్‌కు తమిళ డైరెక్టర్ అట్లీ అదిరిపోయే స్టోరీని వండి విందుకు రెడీ చేస్తున్నాడు.
ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7న జవాన్ విడుదల కాబోతోంది. ఈ సినిమాలో దక్షిణాది భామ లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయకిగా నటిస్తోంది. దీంతో ఈ సినిమాపై దక్షిణాది ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషన్ల హడావిడి షురూ అయ్యింది. ఇందులో భాగంగా మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ జిందా బందా అనే పెప్పి నెంబర్‌ను ఆగస్టు ఫస్ట్ వీక్‌లో విడుదల చేయనున్నారు. ఈ పాటకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఒక్క పాట కోసం దాదాపు రూ.15 కోట్లు ఖర్చు చేశారనే టాక్ బాగా వినిపిస్తోంది. అంతే కాదు వెయ్యి మంది లేడీ డ్యాన్సర్లు ఈ పాటలో డ్యాన్స్ చేయనున్నారని సమాచారం. కొరియోగ్రాఫర్ శోభి ఈ పాటను అత్యద్భుతంగా రూపొందిస్తున్నారట. షారుఖ్ కెరీర్లోనే ఇది రాకార్డ్ అంటున్నారు. ఒక్క పాట కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టారంటే..అందులో మ్యాటర్ ఎంతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అనిరుధ్ మాస్ బీట్‌కు షారుఖ్ ఖాన్ అవుట్ స్టాండింగ్ స్టెప్పులు చూడ్డానికి రెండు కళ్లు చాలవంటూ టాక్స్ వినిపిస్తున్నాయి.