Bigg Boss 7 Telugu Elimination : బిగ్బాస్ హౌస్ నుంచి ఆమె ఔట్..
X
బిగ్బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. సెకండ్ వీకెండ్లో శనివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్కు గట్టి క్లాస్ పీకిన నాగార్జున సండే ఎపిసోడ్లో ఎప్పటిలాగే ఓ కంటెస్టెంట్ను బయటకు పంపారు. సెకండ్ వీక్లో షకీలాను ఎలిమినేట్ చేసినట్లు సమాచారం. మిగతా కంటెస్టెంట్స్తో పోలిస్తే ఆమెకు తక్కువ ఓట్లు రావడం వల్లే బయటకు పంపినట్లు తెలుస్తోంది. టాస్కుల్లో యాక్టివ్గా ఉన్నప్పటికీ నామినేషన్స్ లో ఉన్నవారితో పోలిస్తే ఆమె ఆట తీరు ప్రేక్షకులకు నచ్చలేదని టాక్ వినిపిస్తోంది.
నిజానికి లీస్ట్ ఓటింగ్ వచ్చిన క్యాండిడేట్లలో శోభితా శెట్టి, షకీలా, టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణలు ఉన్నట్లు సమాచారం. అయితే గత రెండు రోజులుగా హౌస్లో జరుగుతున్న పరిణామాలు యావర్కు కలిసొచ్చాయి. ఇక గౌతమ్ కృష్ణకు ఫ్యాన్ బేస్ బాగానే ఉండటం పాజిటివ్గా మారినట్లు సమాచారం. ఇక ఓటింగ్ పరంగా చూస్తే శోభిత, షకీలా, టేస్టీ తేజ లీస్ట్ త్రీలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్లామర్ డోస్ శోభితకు కలిసిరాగా .. నారదునిలా పుల్లలు పెడ్తున్న టేస్టీ తేజను హౌస్ లో ఉంచితే మరింత కంటెంట్ క్రియేట్ అవుతుందన్న ఉద్దేశంతో బిగ్ బాస్ యాజమాన్యం షకీలాను బయటకు పంపినట్లు టాక్ వినిపిస్తోంది.
బిగ్ బాస్లో ఒకప్పటి షకీలా కాకుండా షకీలా అమ్మలా అడుగుపెట్టిన ఆమె.. ఎలాంటి నెగిటివిటీ లేకుండా ఇంటి నుంచి బయటకు వచ్చారు. వీలైనంత వరకు ఆమె కంటెంట్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా అర్థరాత్రి సమయంలో అకస్మాత్తుగా నిద్ర నుంచి లేచి ఆమె చేసిన ప్రాంక్ కంటెస్టెంట్లందరినీ భయపెట్టింది. అందరినీ కలుపుకుపోయే తత్వంతో పెద్దరికం నిలుపుకుంది.