Home > సినిమా > ఒన్ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోన్న షరతులు వర్తిస్తాయి

ఒన్ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోన్న షరతులు వర్తిస్తాయి

ఒన్ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోన్న షరతులు వర్తిస్తాయి
X

తుఫాన్ ముందు ప్రశాంతత, నిశ్శబ్ధ విప్లవం అంటూ కొన్ని పదబంధాలు వింటూ ఉంటాం. సినిమా పరిశ్రమలో కూడా అలాంటివి అప్పుడప్పుడూ జరగుతుంటాయి. యస్..ఓ బ్లాక్ బస్టర్ సినిమాకు ముందు ఎలాంటి సౌండ్ లేకుండా ఉండటం.. రిలీజ్ తర్వాత బ్లాక్ బస్టర్ కావడం అరుదుగా చూస్తుంటాం. బలగం సినిమా సృష్టించిన నిశ్శబ్ధ విప్లవం అలాంటిదే. ఇప్పుడు అలాంటి మరో సంచలనానికి సిద్ధం అన్నట్టుగా కనిపిస్తోన్న సినిమా షరతులు వర్తిస్తాయి. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. దిల్ రాజు లాంటి వాడే ఈ సినిమా బలగంను మించి ఉంటుంది అని అన్నాడంటే ఈ సినిమా ఏ షరతులూ లేకుండా ఓ సంచలన విజయం సాధించబోతోందని అర్థం కావడం లేదూ..?

షరతులు వర్తిస్తాయి.. ఈ మధ్య కాలంలో వినగానే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్న టైటిల్ ఇది. ఏ సినిమాకైనా ఓ మంచి టైటిల్ పడితే అది సగం విజయం సాధించినట్టే అంటారు. అలా చూస్తే ఈ మూవీకి ఇది అద్భుతమైన టైటిల్ అని ఇప్పటికే ఎంతోమంది అనుకుంటున్నారు. ఇండస్ట్రీ నుంచి సైతం ఈ టైటిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కుమార స్వామి అలియాస్ అక్షర ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయచం కాబోతున్నాడు. మరి ఫస్ట్ మూవీ అంటే బెస్ట్ నే ఇవ్వాలనుకుంటారు కదా.. ఈ సినిమా టీజర్ చూసినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ అదే ఫీల్ అయ్యారు.తెలంగాణ నేపథ్యంలో మరో అద్భుతమైన సినిమా చూడబోతున్నాం ముందే ఫిక్స్ అయ్యారంటే ఈ డైరెక్టర్ లో ఎంత మేటర్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మధ్య తరగతి మనుషులకు సంబంధించిన అనేక కథలు ఇప్పటికే వెండితెర చాలా చూసింది. బట్ దిగువ మధ్య తరగతి అనగానే అలగా జనం అన్నట్టుగానే ఎక్కువగా చూపించారు. బట్ ఆ దిగువ తరగతుల్లోనూ గొప్ప అనుబంధాలు..అనుభూతులుంటాయి. అన్ని తరగతుల్లాగానే అందమైన కలలుంటాయి. ఆ కలల కోసం సాగించే ప్రయాణాలు.. ఆ ప్రయాణాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. ఈ అన్నిటి నేపథ్యంలో రాబోతోన్న సినిమానే షరతులు వర్తిస్తాయి. ఇక ఈ మూవీ టీజర్ కు గొప్ప స్పందన రావడమే కాదు.. చాలా తక్కువ టైమ్ లోనే ఒన్ మిలియన్ వ్యూస్ ను సంపాదించుకుని సూపర్బ్ అనిపించకుంటోంది. పెద్ద సినిమాలకైతే డబ్బులిచ్చి మరీ మిలియన్ల కొద్దీ వ్యూస్ ను రప్పించుకుంటారు. బట్ చిన్న సినిమాలకు సంబంధించి ఆ ప్రయత్నం ఉండదు. కనిపించేదంతా నిజాయితీగానే ఉంటుంది. అలా ఆర్గానిక్ గానే షరతులు వర్తిస్తాయి మూవీ ఒన్ మిలియన్ వ్యూస్ ను దాటి టూ మిలియన్ వ్యూస్ వైపు దూసుకుపోతోంది. మరి ఈ దూకుడు సినిమా కలెక్షన్స్ లోనూ కనిపిస్తుందా..? దిల్ రాజు చెప్పినట్టు, దర్శకుడు నమ్మినట్టు బలగం ను మించిన విజయం సాధిస్తుందా అనేది చూడాలి.

Updated : 6 Feb 2024 5:02 PM IST
Tags:    
Next Story
Share it
Top