Sharathulu Varthisthai Trailer : నీ జీతం పెరిగేసరికి నా జీవితం అయిపోతుంది.. అదిరిన ట్రైలర్
X
ఒకప్పుడు తెలంగాణ వాళ్లను సినిమాల్లో విలన్స్గా, బఫూన్స్ గానే చూపించారు. బట్ తెలంగాణ వచ్చినంక అంతా మారింది. ఈ భాష, యాస సొగసు ప్రపంచానికి చాటిచెప్తూ పలు సినిమాలు తెరకెక్కాయి. అప్పటి నుంచి మన సినిమా అన్ని ప్రాంతాల్లోనూ జెండా ఎగరేస్తోంది. ఈ మట్టి పరిమళాన్ని మరింత చిక్కగా చూపుతూ ఇప్పుడు మరో సినిమా వస్తోంది. అదే షరతులు వర్తిస్తాయి. ఈ మూవీలో చైతన్య రావు, భూమి శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మార్చి 15న విడుదలవుతోన్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
షరతులు వర్తిస్తాయి ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఈ దేశంలో ఉన్న 80శాతం సామాన్యుల కథనే ఈ సినిమా అనే క్యాప్షన్తో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతోంది. హలో విజయశాంతి.. చెప్పు చిరంజీవి అంటూ హీరో హీరోయిన్ల మధ్య సాగే డైలాగ్తో ప్రారంభమైన ట్రైలర్ ఇంప్రెసివ్గా ఉంది. నీ జీతం పెరిగేసరికి నా జీవితం అయిపోతుంది, మనలో ఒకడే మనల్ని నమ్మించి మోసం చేసిండు వంటి డైలాగ్స్ బాగున్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ యూట్యూబ్లో దుమ్మురేపుతున్నాయి. మొత్తంగా తెలంగాణ నేటివిటీతో స్వచ్ఛమైన మట్టి వాసన లాంటి సినిమాగా కనిపిస్తోన్న ఈ షరతులు వర్తిస్తాయి అనే సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.