ఆమె నాకు నరకం చూపించింది...సమంత షాకింగ్ కామెంట్స్
X
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్య ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలోనే అందమైన కపుల్స్‌గా వీరిద్దరూ క్రేజ్ తెచ్చుకున్నారు. కానీ కొన్నికారణాల వల్ల ఈ యంగ్ కపుల్ డివోర్స్ తీసుకుని ఎవరికి వారే ఉంటున్నారు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఎవరి కెరీర్లో వారు ముందుకెళ్తున్నారు. ఫుల్ బిజీగా తమ సమయాన్ని గడుపుతున్నారు. కానీ సామ్, నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పటి నుంచి వీరిద్దరికి సంబంధించి ఏ న్యూస్ వచ్చినా నెట్టింట వైరల్‌గా మారుతోంది. తాజాగా సామ్‌కు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సమంత అమల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
సమంత, నాగచైతన్య డివోర్స్ తీసుకున్నప్పటికీ అమెరికా వెళ్లినప్పుడల్లా నాగచైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మిని కలుసుకుంటుందట. ప్రస్తతం అమెరికాలో ఉన్న సామ్ రీసెంట్గా శ్రీలక్ష్మిని కలిసిందని టాక్ వినిపిస్తోంది. ఆమెతో తన మాజీ అత్త అమల గురించిన నమ్మలేని నిజాలు బయటపెట్టినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ‘‘ఆ ఇంట్లో ఉండే మనుషులు మొత్తం విచిత్రమైన వాళ్ళని తన మాజీ అత్త లక్ష్మికి చెప్పుకొచ్చిందట సామ్. ఒకానొక సమయంలో తన స్వేచ్ఛనే కోల్పోవాల్సి వచ్చిందట. ఇంట్లో ఉన్నా జైలులో ఉన్న ఫీల్ కలిగేదట. కష్టమైన ఆంక్షలు పెట్టేవారని మరీ ముఖ్యంగా అమల పెట్టే కండిషన్స్ తనకు నరకం అంటే ఏంటో చూపించాయని సామ్ కన్నీరు పెట్టుకుందట. నాగచైతన్య కూడా తనను అర్థం చేసుకోలేదని ఏడ్చేసిందట అందుకే తమ ఇద్దరి మధ్య దూరం పెరిగిందని లక్ష్మికి సమంత చెప్పిందని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం ‘ఖుషి’ మూడ్‌లో ఉంది. సెప్టెంబర్ 1న ఖుషీ సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయబోతోంది. శివ నిర్వాణ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా కోసం సామ్, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే జరిగిన ఖుషీ మ్యూజిక్ కన్సర్ట్ తరువాత సామ్ ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి న్యూయార్క్ చెక్కేసింది. అమ్మడు అక్కడ పలు అందమైన ప్రాంతాల్లో చెక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తోంది. ఇన్స్టాగ్రామ్ వేదికగా అందమైన ఫోటోలను వదులుతూ మూవీకి ప్రమోషన్ చేస్తోంది.