'ఓసారి టచ్ చేయొచ్చా అని అడిగారు..' హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X
ఇప్పటి యూత్‌కి పెద్దగా తెలియదు కానీ.. బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా అంటే ఒకప్పడు చాలామందికి హాట్ ఫేవరేట్. మోడల్ గా కేరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ చేసిన సినిమాలు తక్కువే అయినా.. ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం చాలా ఎక్కువ. 2012లో 'ప్లేబోయ్' అనే శృంగార పత్రికలో పూర్తి నగ్నంగా ఫోజులిచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. ఈమె పక్కా హైదరాబాదీ. చదవు, బాల్యం అంతా ఇక్కడే.. సినిమాలపై ఆసక్తితో తను ముంబయిలో అడుగు పెట్టింది.
అయితే కేరీర్ ప్రారంభంలో, అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో కొంతమంది డైరెక్టర్స్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది షెర్లిన్. తనతో డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడేవారని చెప్పింది. వారిలో ఓ డైరెక్టర్ హద్దుమీరి మాట్లాడగా.. ‘మీకు పెళ్లైంది? ఆ విషయం మర్చిపోవద్దు’ అని బదులిచ్చానని .. అందుకు ఆయన.. ‘నా భార్యతో సుఖం లేదు, సఖ్యత లేదని’ అని చెప్పాడని తెలిపింది. భార్యతో మాత్రం ఓపెన్‌గా మాట్లడలేనని.. కానీ నాతో మాత్రం ఇలా మాట్లాడుతానని చెప్పగా ఆశ్చర్యమేసిందని చెప్పింది
ఇక చాలా మంది దర్శకులైతే ఓపెన్‌గానే వక్షోజాలను సర్జరీ చేయించుకున్నావా అని అడిగేవారని, ఇలాంటి వారి లిస్ట్ చాలానే ఉందని చెప్పింది. వాస్తవం కూడా అదే కాబట్టి అవును.., చేయించుకున్నాననే చెప్పగానే... వాళ్లు వెంటనే ఓసారి టచ్ చేయొచ్చా..? సైజ్ ఎంత..? అని అడిగారని.. అది తనకు షాకింగ్ గా అనిపించిందని తెలిపింది. ఇలా సినీ పరిశ్రమలో చాలా మంది దర్శకుల నుంచి కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. అలాంటి వారిలో కొందరైతే ఏకంగా డిప్రెషన్ ఎపిసోడ్‌ల నుంచి బయటపడేందుకు డ్రగ్స్‌లో మునిగిపోవాలని చాలాసార్లు సూచించారని, కానీ అలాంటి వాటికి దూరంగానే ఉండేదానినని చెప్పుకొచ్చింది.
కిడ్నీ ఫెయిల్ కావడంపై మాట్లాడుతూ.. ‘‘2021లో నాకు కిడ్నీ ఫెయిల్ అయ్యింది. నా జీవితం ఎంతో క్లిష్టంగా మారింది. ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోను. కుటుంబసభ్యులు సైతం సాయం చేయడానికి ముందుకు రాలేదు. విషయం తెలిసినా కూడా ఎవరూ నాతో మాట్లాడలేదు. కానీ, నా జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలనుకున్నా. ఒక్కరోజు కూడా వదులుకోకూడదని నిర్ణయించుకుని ముందుకు అడుగువేశా’’ అని ఆమె వాపోయింది.