Home > సినిమా > Biggboss 7: నాగార్జున చెప్పినా.. తీరు మార్చుకోని శివాజీ

Biggboss 7: నాగార్జున చెప్పినా.. తీరు మార్చుకోని శివాజీ

Biggboss 7: నాగార్జున చెప్పినా.. తీరు మార్చుకోని శివాజీ
X

బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి శివాజీ మంచి కంటెస్టెంట్ గానే ఉంటున్నాడు. కానీ ఒక్కోసారి తిక్కగా ప్రవర్తిస్తూ బిగ్ బాస్, నాగార్జునలతో తిట్లు తింటుంటాడు. అయితే ఈసారి చేసిన ఓవర్ యాక్షన్.. శివాజీకి ప్రమాదంగా మారే అవకాశం ఉంది. నాగార్జున చెప్పినా.. ఆ తప్పు మళ్లీ చేసినందుకు పనిష్మెంట్ గానీ, హౌస్ లోనుంచి బయటికి వెళ్లిపోవడం గానీ జరిగే అవకాశం కనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం బాగానే ఉన్న శివాజీ.. రెండో వారం నుంచి ‘ఉండాలని లేదు.. బయటికెళ్లిపోతా’ అంటూ ఒకటే పాట పాడుతున్నాడు. దీంతో వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున చాలాసార్లు శివాజీకి వార్నింగ్ ఇచ్చాడు. నాగ్ వార్నింగ్ తో కొంత తగ్గిన శివాజీ ఇకపై అలా అననంటూ మాటిచ్చాడు.

తాజా గురువారం ఎపిసోడ్ లో యావర్, శోభాశెట్టితో గొడవయింది. ‘ఇంట్లో ఎవరికీ లేనిది.. ప్రతీ విషయం మీకేందుకు’ అంటూ శోభ, శివాజీపై రెచ్చిపోయింది. యావర్, శివాజీని చపాతీ తెమ్మన్నందుకు అక్కడ మళ్ళీ గొడవ. దీంతో ఏమైందో ఏమో కానీ.. శివాజీ మళ్లీ అదే పాత పాట మొదలుపెట్టాడు. రతికతో మాట్లాడుతూ.. ‘ఉండబుద్ది అయితలేదు బిడ్డా.. కావట్లే నాతో’ అని అన్నాడు. రతిక అలా కాదు అని ఎంత చెప్పినా.. ‘ఒట్టమ్మా, ఇన్నిరోజులు దాసుకుని ఉండటం నా వల్ల కావట్లేదు’ అవేదన వ్యక్తం చేశాడు. అయితే నాగ్.. అలా అనొద్దని చెప్పినా, శివాజీ మళ్లీ ఇంటికి వెళ్లిపోతానని అనటం రూల్స్ బ్రేక్ చేసినట్లే. దీనిపై బిగ్ బాస్ సీరియస్ అయితే మాత్రం శివాజీని ఇంటికి పంపేస్తారు.





Updated : 29 Sept 2023 10:48 AM IST
Tags:    
Next Story
Share it
Top