Home > సినిమా > శివమల్లాల బ్యానర్ స్టార్ట్.. సినీ నిర్మాణ సంస్థగా 'శివమ్‌ మీడియా'

శివమల్లాల బ్యానర్ స్టార్ట్.. సినీ నిర్మాణ సంస్థగా 'శివమ్‌ మీడియా'

శివమల్లాల బ్యానర్ స్టార్ట్.. సినీ నిర్మాణ సంస్థగా శివమ్‌ మీడియా
X

టాలీవుడ్‌లో మరో నిర్మాణ సంస్థ ప్రారంభమైంది. 'శివమ్ మీడియా' పేరుతో ఈ బ్యానర్ స్టార్ట్ అయ్యింది. సీనియర్ జర్నలిస్ట్ శివమల్లాల నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. గురువారం నటుడు అలీ, నిర్మాత, డైరెక్టర్ ప్రవీణా కడియాల, అనిల్ కడియాల శివమ్ మీడియా లోగో, బ్యానర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. శివ గత 20 ఏళ్లుగా తనకు తెలుసని, చిన్న స్థాయి నుంచి కెరీర్‌ను ప్రారంభించి నిర్మాతగా బ్యానర్ స్థాపించడం ఆనందంగా ఉందన్నారు.

అనిల్‌ కడియాల మాట్లాడుతూ..‘శివమ్‌ మీడియా’ అనే బ్యానర్‌పై శివ అనేక సినిమాలు తీసి మంచి విజయాలు అందుకోవాలన్నారు. ప్రవీణా కడియాల మాట్లాడుతూ..చిన్న రిపోర్టర్‌గా, పిఆర్వోగా పనిచేసిన శివ బ్యానర్‌ పెట్టడం ఆనందంగా ఉందన్నారు. ఈ బ్యానర్‌పై త్వరలో అనేక సినిమాలు వస్తాయన్నారు. శివమ్‌ మీడియా నిర్మాత శివమల్లాల మాట్లాడుతూ.. తనకు ఎప్పుడూ సపోర్టు చేసే ముగ్గురు స్నేహితులు అలీ, అనిల్, ప్రవీణా తన బ్యానర్ ప్రారంభించడం హ్యాపీగా ఉందన్నారు. శివమ్ మీడియా బ్యానర్‌పై మంచి సినిమాలు వస్తాయన్నారు.

హీరో హమరేశ్, హీరోయిన్లు ప్రార్థన సందీప్, ఆడుగాలం మురుగుదాస్‌తో కొత్త సినిమా ప్రారంభం కానుందన్నారు. కె.ఎన్ విజయ్ ఈ మూవీ మాటలు అందించారని, రాంబాబు గోసాల పాటలు రాశారని, సుందరమూర్తి కె.ఎస్ సంగీతం అందించారన్నారు. ఈ మూవీకి వాలీ మోహన్‌దాస్ కథ, దర్శకత్వం వహిస్తున్నారన్నారు. తమ తొలి సినిమాను అందరూ ఆదరించాలని కోరారు.

Updated : 28 March 2024 4:37 PM IST
Tags:    
Next Story
Share it
Top