శోభా శెట్టి ఎలిమినేట్ అయినా.. రెమ్యూనరేషన్ గట్టిగానే తీసుకుంది
X
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. 14 వారాలు పూర్తి చేసుకుంది. ఈ వారంలో తక్కువ ఓటింగ్ వచ్చిన బిగ్ బాస్ దత్త పుత్రిక శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యింది. సీజన్ స్టార్ట్ అయిన మొదటి వారం నుంచి నామినేషన్స్ లో ఉంటున్న శోభను.. బిగ్ బాస్ సేఫ్ చేస్తూ వస్తున్నట్లు టాక్. టాస్కుల్లో బాగానే ఆడినా.. ఓడిపోతే మాత్రం అస్సలు తట్టుకోకపోయేది శోభ. దాంతో ఓపిక కోల్పోయి.. తన క్లోజ్ ఫ్రెండ్స్ అయినా వారిపై అరిచేది. అలా శోభా ఎక్కువ నెగిటివిటీ సంపాదించుకుంది. అందుకే ఫ్యాన్స్ తనపై నెగిటివిటీని పెంచుకున్నారని టాక్. ప్రస్తుతం శోభ రెమ్యూనరేషన్ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.
14 వారాలకి గానూ రెమ్యూనరేషన్ బాగానే తీసుకున్నట్టు తెలుస్తోంది. శోభ వారానికి రెండు లక్షల చొప్పున 14 వారాలకి రూ.28 లక్షల వరకు తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ చివరకు వచ్చిన కారణంగా అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మిడ్ వీక్ ఎలిమినేట్ అవుతారు.. టాప్ కంటెస్టెంట్స్ గా ఎవరు ఉంటారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.