Home > సినిమా > Ramcharan : రామ్ చరణ్‌కు షాక్.. 'గేమ్ చేంజర్' నుంచి వీడియో లీక్

Ramcharan : రామ్ చరణ్‌కు షాక్.. 'గేమ్ చేంజర్' నుంచి వీడియో లీక్

Ramcharan : రామ్ చరణ్‌కు షాక్.. గేమ్ చేంజర్ నుంచి వీడియో లీక్
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీపై టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. అంజలి, శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. పొలిటికల్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది.

గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ డబుల్ రోల్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి పలు లీక్‌లు వైరల్ అయ్యాయి. ఫోటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇందులో చెర్రీ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో, ఎమ్మెల్యే పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఈ మూవీ నుంచి మరో వీడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. సినిమాలో మార్కెట్ నడి రోడ్డుపై హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. ఆ సమయంలోనే రామ్ చరణ్ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. ఈ సన్నివేశం సినిమాకే హైలెట్ అవుతుందట. థియేటర్లలో ఈ ఎలివేషన్ సీన్‌కు గూస్ బంప్స్ వస్తాయని అనుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోనే లీక్ అవ్వడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో చరణ్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా నటిస్తున్నట్లు బోనీ కపూర్ స్వయంగా తెలిపారు.


Updated : 23 Feb 2024 6:10 PM IST
Tags:    
Next Story
Share it
Top