Home > సినిమా > Singer Chinmay : సింగర్ చిన్మయికి షాక్.. గచ్చిబౌలిలో కేసు నమోదు

Singer Chinmay : సింగర్ చిన్మయికి షాక్.. గచ్చిబౌలిలో కేసు నమోదు

Singer Chinmay : సింగర్ చిన్మయికి షాక్.. గచ్చిబౌలిలో కేసు నమోదు
X

స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాదపై హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సినీ నటి అన్నపూర్ణమ్మను విమర్శిస్తూ చిన్మయి సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో చిన్మయి దేశాన్ని అవమానించేలా మాట్లాడిందని హెచ్‌సీయూ విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు చేశాడు. దీంతో సింగర్ చిన్మయి శ్రీపాదపై కేసు నమోదైంది. బాధ్యత కలిగిన పౌరురాలిగా దేశాన్ని తక్కువ చేసేలా, కించపరిచేలా మాట్లాడ్డం సరికాదని కుమార్ సాగర్ తన ఫిర్యాదులో తెలిపాడు.

ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ..ఆడవాళ్లకు అర్ధరాత్రి స్వాతంత్రం దేనికి? రాత్రి 12 గంటల తర్వాత ఆడవాళ్లకు బయట ఏం పని? అంటూ ప్రశ్నించింది. ఇప్పుడంతా ఎక్స్‌పోజింగ్ ఎక్కువైపోయిందని, మగవాళ్లు ఏదో ఒకటి అనేటట్లు ఆడవాళ్లు రెడీ అవుతున్నారని అన్నపూర్ణమ్మ అన్నారు. ఎప్పుడూ ఎదుటివాళ్లదే తప్పనడం సరికాదని, తప్పు తమపైపు కూడా చూసుకోవాలని అన్నపూర్ణమ్మ చెప్పారు.

అన్నపూర్ణమ్మ మాటలకు సింగర్ చిన్మయి తీవ్రంగా మండిపడ్డారు. అన్నపూర్ణమ్మ వీడియోను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. అన్నపూర్ణమ్మ నటనకు తాను అభిమానినని, అభిమానించేవాళ్లే అలా మాట్లాడితే తీవ్రమైన వేదన కలుగుతుందని చిన్మయి వీడియోలో చెప్పుకొచ్చారు. అలాగే ఇలాంటి దేశంలో ఆడపిల్లగా పుట్టడం నా కర్మ, ఇదొక....కంట్రీ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. బాధ్యత గల మహిళగా దేశాన్ని కించపరిచేలా చిన్మయి మాట్లాడ్డం సరికాదని, అందుకే ఫిర్యాదు చేసినట్లు హెచ్‌సీయూ విద్యార్థి కుమార్ సాగర్ తెలిపారు. ఇకపోతే ఈ కేసుపై ఇప్పటి వరకూ చిన్మయి స్పందించలేదు.



Updated : 29 Feb 2024 12:35 PM IST
Tags:    
Next Story
Share it
Top