Home > సినిమా > బాలయ్య అక్కడ బిజీ బిజీ..ఆందోళనలో ఫ్యాన్స్ ..

బాలయ్య అక్కడ బిజీ బిజీ..ఆందోళనలో ఫ్యాన్స్ ..

బాలయ్య అక్కడ బిజీ బిజీ..ఆందోళనలో ఫ్యాన్స్ ..
X

నటసింహం నందమూరి బాలకృష్ణ ఓ పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోపక్క సినిమాలు చేస్తున్నారు. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్లడంతో ఆయన పూర్తిగా పార్టీ కార్యక్రమాలకే పరిమితం అయ్యారు. పార్టీ నేతలతో సమీక్షలు , భవిష్యత్తు కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. అయితే రాజకీయంగా యాక్టివ్ కావడంతో.. సినిమాలకి కాస్త బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది. బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. బాలయ్య అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతో సినిమా ఎప్పుడు థియేటర్‎లో విడుదల అవుతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వాస్తవానికి మేకర్స్ ఈ సినిమాను అక్టోబర్ 19న థియేటర్లలో విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ రాజకీయంగా ప్రస్తుతం బిజీ కావడంతో మూవీకి సంబంధించి కొన్ని పనులు పెండింగ్‎లో పడిపోయాయని, ఇవి పూర్తి కావడానికి కాస్త సమయం పడుతుందని మేకర్స్ అంటున్నారు .

యాక్షన్ ఎంటెర్టైనర్‎గా తెరకెక్కుతున్న భగవంత్ కేసరిలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‎గా నటిస్తుండగా, యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్రను పోషిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. అనిల్ రావిపూడి నిన్నమొన్నటి వరకు షూటింగ్‎ని చకచకా పరుగులు పెట్టించినా ఇంకా కొంచెం బ్యాలెన్స్ మిగిలిపోయింది. అది కూడా మరో వారంలో పూర్తి చేద్దాం అనుకున్నారు కానీ.. హీరో బాలకృష్ణ ఇప్పుడు అందుబాటులో లేరు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలులో ఉండడంతో బాలయ్య హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లి అక్కడే బాబు ఫ్యామిలీకి, టీడీపీ కార్యకర్తలకి, నేతలకి అందుబాటులో ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ తో కలిసి రాజమండ్రి వెళ్లి చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి , భగవంత్ కేసరి నిర్మాతలు బాలయ్యని కలవబోతున్నారని తెలుస్తుంది. బాలయ్యతో లింక్ అయ్యి ఉన్న సీన్స్ పెండింగ్‏లో ఉండడంతో ఆ డేట్స్ కోసం బాలయ్య నుంచి క్లారిటీ తీసుకునేందుకు బాలయ్య దగ్గరకి వెళ్ళబోతున్నట్లు సమాచారం. ఒకవేళ బాలయ్య చంద్రబాబు జైలు నుంచి బయటికి వచ్చే వరకు అందుబాటులో లేకపోతే.. భగవంత్ కేసరి సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉంది. ఈ సినిమా తరువాత బాలకృష్ణ బాబీ డైరెక్షన్‎లో నటించనున్నారు. ఇటీవలే ఈసినిమా లాంచ్ అయ్యింది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. మరి బాలయ్య షూటింగ్ పనులకి డేట్స్ ఇస్తారో లేదో అనేది తెలియాల్సి ఉంది .

Updated : 15 Sept 2023 2:15 PM IST
Tags:    
Next Story
Share it
Top