Home > సినిమా > Renu Desai: వారసులు కాబట్టీ ఎంట్రీ ఈజీనే.. అకీరాపై మొదలైన ట్రోలింగ్

Renu Desai: వారసులు కాబట్టీ ఎంట్రీ ఈజీనే.. అకీరాపై మొదలైన ట్రోలింగ్

Renu Desai: వారసులు కాబట్టీ ఎంట్రీ ఈజీనే.. అకీరాపై మొదలైన ట్రోలింగ్
X

దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు , పవన్ కల్యాణ్‌ కుమారుడు (Pawan Kalyan Son) అకీరా నందన్‌తో కలిసి దిగిన స్టిల్‌ నెట్టింట హల్ చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. రాఘవేంద్రరావు తన మనవడు కార్తికేయ, అకీరా నందన్‌ (Akira Nandan)ను యూఎస్‌ఏలోని ఫిల్మ్‌ స్కూల్‌లో ఇద్దరినీ జాయిన్ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఇద్దరితో కలిసి ఫొటో కూడా దిగారు. ఇక ఈ ఫోటోతో

త్వరలోనే అకీరా నందన్‌ హీరోగా సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇవ్వబోతున్నాడని కొందరు, రాబోయే రోజుల్లో పవన్‌ కల్యాణ్‌ నటవారసుడిగా సిల్వర్ స్క్రీన్‌పై మెరిసేందుకు కావాల్సిన ట్రైనింగ్ తీసుకుంటున్నాడని మరికొందరు చర్చ మొదలెట్టారు. ఇంకొందరైతే.. వారసులకు సులువుగా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి.. ఇది ఎంత వరకు కరెక్ట్ అంటూ ఓ ప్రశ్నిస్తున్నారు.





ఈ కామెంట్లపై అకీరా నందన్‌ తల్లి రేణు దేశాయ్‌ (Renu Desai) స్పందిస్తూ.. ‘‘మీరు మంచి ప్రశ్నే అడిగారు.. అంబానీ తన కంపెనీని.. తన వారసులకు కాకుండా బయటి వ్యక్తులకు ఇస్తే అది కరెక్ట్ అంటారా? ఇదీ అంతే.. సినిమా ఫీల్డ్‌కు చెందిన ఎంతో మంది వారసులు ఇండస్ట్రీలోకి సులభంగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే వాళ్లు వారి తల్లిదండ్రుల వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లలేకపోయినా.. నటులుగా వాళ్లని వాళ్లు నిరూపించుకోవడంలో విఫలమైనా.. కొందరు వారిని ఏమాత్రం జాలి లేకుండా దారుణంగా ట్రోల్‌ చేస్తారు. అదే.. స్టార్‌ వారసులు కాకుండా కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన వారు విఫలమైతే ఎవరూ పట్టించుకోరు. వాళ్లు సక్సెస్‌ అయితే మాత్రం గొప్ప స్టార్స్‌ అవుతారు. ఇక్కడ విషయమేమిటంటే.. వారసులు ఇండస్ట్రీలోకి రావడం ముఖ్యం కాదు. వాళ్లలోని ప్రతిభ ముఖ్యం. టాలెంట్‌ ఆధారంగా స్టార్స్‌ అవుతారు కానీ.. వారసులు కావడం వల్ల కాదు’’ అని అన్నారు.





ఇక ఈ కామెంట్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టిన రేణూ.. అకీరా ఇంకా సినిమాల్లోకి రాకముందే అతడిని ఇంతగా విమర్శిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి అకీరా నందన్‌కు నటనలో కానీ లేదా హీరో అవుదామని కాని ఆసక్తి లేదు. భవిష్యత్‌ను అంచనా వేయలేను. నా ఇన్‌స్ట్రాగ్రామ్‌ పోస్ట్ పెట్టిన ప్రతీసారి చేస్తున్న పుకార్లకు పుల్‌ స్టాప్‌ పెట్టండి. అలాగే అకీరాకు హీరో అవ్వాలని లేదని.. రోజులో ఎన్నో గంటలు కష్టపడి పియానో నేర్చుకుంటున్నాడని ఆమె చెప్పారు. ఒకవేళ అకీరా నందన్‌ యాక్టింగ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటే.. ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకునే మొదటి వ్యక్తిని నేనే అంటూ చెప్పుకొచ్చింది రేణూ దేశాయ్‌.




Updated : 23 Aug 2023 12:08 PM IST
Tags:    
Next Story
Share it
Top