Vijaya Shanti : పీవీకి భారతరత్నపై..విజయశాంతి ఆసక్తికర ట్వీట్
X
మాజీ ప్రధాని పీవిని భారతరత్న పురస్కరం వరించిన వేళా నటి, కాంగ్రెస్ నేత విజయ శాంతి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆత్మగౌరవ విజయకేతమైన ఎన్డీఆర్‌కు భారతరత్న ప్రకటించి ఉంటే తెలుగు ప్రజానీకం మరింత పులకించిపోయేది. ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి అని ఈ రోజు నిండుగా మెండుగా కనిపిస్తోందని రాములమ్మ పేర్కొన్నారు. అన్ని పార్టీలు ఈ అంశాన్ని బలపరుస్తాయని నేను నమ్మడం అతియోక్తి కాదన్నది. నా నిశ్చితాభిప్రాయం అని విజయశాంతి ట్వీట్టర్ ఎక్స్‌లో రాసుకోచ్చారు. తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహా రావుకు శుక్రవారం కేంద్రం భారత రత్న ప్రకటించిన విషయం తెలిసిందే. పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, ఎమ్. ఎస్ స్వామినాథన్ లకు భారత అత్యున్నత పౌర పురస్కారాలు వరించాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి ఆసక్తికర ట్వీట్ చేశారు.ఈ ట్వీట్ కు ఆనాడు సీఎంగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా నంది అవార్డు అందుకుంటున్న ఫోటోను జత చేశారు.
భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండక పోవచ్చు కానీ, తెలుగుజాతి గౌరవ ప్రతీక శ్రీ పీవీ నరసింహా రావు గారిని వరించిన పురస్కారం మన ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్ గారికి కూడా ప్రకటించిఉంటే తెలుగు ప్రజానీకం యావత్తు మరింత పులకించిపోయేదన్నది తిరుగులేని… pic.twitter.com/Q95K2oFOSC
— VIJAYASHANTHI (@vijayashanthi_m) February 9, 2024