Anushka Shetty : షాకింగ్..సినిమా ఛాన్సు కోసం అలా మారిపోయిన జేజమ్మ!
X
ఆ స్టార్ హీరోయిన్ రెండు దశాబ్దాల పాటు తెలుగు సినిమా పరిశ్రమలను ఏలింది. తెలుగులోనే కాదు అటు తమిళ్‌లో కూడా స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో వారెవ్వా అనిపించింది. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఆ తర్వాత కనుమరుగైపోయింది. తమ హీరోయిన్ సినిమాలే చేయకపోవడంతో అభిమానులంతా లబోదిబోమన్నారు. అయినా ఆ అమ్మడు మాత్రం సైలెంట్‌గానే ఉంటూ వస్తోంది. ఇక సినిమాలే చేయదనుకున్న తరుణంలో ఇప్పుడు ఓ పని చేస్తోంది. సినీ ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్ల తర్వాత ఆమె అలా మారిపోవడం చూసి అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఆమె ఏం చేస్తోంది? ఎలా మారిపోయింది? వివరాల్లోకి వెళ్దాం.
అనుష్క శెట్టి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులు అందరికీ గుర్తుండే ఉంటుంది. 'సూపర్' సినిమాతో అనుష్క తెలుగు తెరకు పరిచయం అయ్యింది. టాలీవుడ్ బడా హీరో అక్కినేని నాగార్జున ఈ ముద్దుగుమ్మను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తర్వాత అరుంధతి సినిమాలో అనుష్క తన విశ్వరూపాన్ని చూపించింది. స్టార్ హీరోలు సైతం షాకయ్యేలా ఇండస్ట్రీ రికార్డులు సాధించింది. ఆ సినిమాతో ఆమె గురించి ఇతర ఇండస్ట్రీ వాళ్లు కూడా చర్చించుకున్నారు. ఆ తర్వాత వరుసగా ప్రభాస్, మహేష్ బాబు, రవితేజ, గోపి చంద్, వెంకటేష్, అల్లు అర్జున్, విక్రమ్, రజనీకాంత్, సూర్య లాంటి పెద్ద పెద్ద హీరోల సరసన నటించింది.
'బాహుబలి'లో దేవసేనగా అనుష్కను తప్పా ఇంకెవ్వరినీ ఊహించుకోని రీతిలో జీవించింది. 'భాగమతి' లాంటి హర్రర్ మూవీ సూపర్ హిట్ కావడానికి అనుష్కనే కారణమని ఇండస్ట్రీ మొత్తం చెప్పుకున్నారు. అలాంటి అనుష్క 2018 నుంచి కేవలం మూడు సినిమాలే చేసింది. గత ఏడాది ఆమె 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమె సైలెంట్ అయిపోయింది. ఇక అనుష్క సినిమాలే చేయదని అందరూ అనుకున్నారు. కానీ ఇండస్ట్రీకి వచ్చిన 19 ఏళ్ల తర్వాత అనుష్క టాలీవుడ్ నుంచి మలయాళంలోకి ఎంట్రీ ఇస్తోంది.
తొలిసారి అనుష్క మలయాళంలో సినిమా చేస్తోంది. 'కథానర్' అనే సినిమాలో జయసూర్య సరసన అనుష్క శెట్టి నటిస్తోంది. ఈ రోజే స్వీటీని తమ సెట్స్‌లోకి మూవీ యూనిట్ బొకే ఇచ్చి వెల్కమ్ చెప్పారు. తాజాగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ కోసం ఆమె చాలా సన్నబడిపోయినట్లు తెలుస్తోంది. బొద్దుగా ఉండే స్వీటీ.. అలా మారిపోవడం చూసి ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. మరోవైపు అనుష్క చేస్తోన్న మలయాళం సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తారో లేదో చెప్పలేదు. మలయాళంలోకి వెళ్లిన అనుష్క మళ్లీ తెలుగులో సినిమాలు చేస్తుందా? లేదా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇక అనుష్క పెళ్లి వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. పెళ్లి కోసమే ఆమె సినిమాలు మానేసిందంటూ అప్పట్లో పుకార్లు వినిపించాయి. రెబల్ స్టార్ ప్రభాస్‌తో అనుష్క పెళ్లంటూ అనేక రూమర్స్ వైరల్ అయ్యాయి. ప్రభాస్ ఫ్యామిలీతో కూడా అనుష్క క్లోజ్‌గా ఉండటం చూసి అదే నిజం అని అందరూ అనుకున్నారు. కానీ వారిద్దరి పెళ్లిపై అటు అనుష్క కానీ, ఇటు ప్రభాస్ కానీ క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడేమో తెలుగు ఇండస్ట్రీనే వదిలి వేరే ఇండస్ట్రీలోకి వెళ్లిపోయింది. ఇదంతా చూసిన అనుష్క అభిమానులు త్వరగా తెలుగు సినిమాలు చేయాలని కోరుతున్నారు. స్వీటీని మిస్ అవుతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
#AnushkaShetty is all set to work in her debut Malayalam film and has joined the sets of #Jayasurya starrer #Kathanar ✨ #MangoMalayalam pic.twitter.com/ze7loMPArE
— Mango Malayalam (@MangoMalayalam) March 12, 2024