Home > సినిమా > లోకేష్ కనగరాజ్‌తో రెచ్చిపోయిన శృతిహాసన్

లోకేష్ కనగరాజ్‌తో రెచ్చిపోయిన శృతిహాసన్

లోకేష్ కనగరాజ్‌తో రెచ్చిపోయిన శృతిహాసన్
X

తమిళ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న లోకేష్ కనగరాజ్‌తో హీరోయిన్ శృతిహాసన్ రెచ్చిపోయింది. కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చిన శృతి ఆ తర్వాత కొంతకాలానికి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అటు తెలుగు, ఇటు తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ పాపులారిటీని సంపాదించుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో గబ్బర్ సింగ్ చేసిన తర్వాత ఈ అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

తాజాగా శృతి హాసన్ తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. వారిద్దరి మధ్య సాగే ఓ రొమాంటిక్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మధ్య 'లియో' మూవీతో హిట్ కొట్టిన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు రజినీ కాంత్‌తో ఓ మూవీ చేస్తున్నాడు. షూటింగ్ గ్యాప్‌లో శృతి హాసన్‌తో ఓ సాంగ్ చేసి అందరికీ షాకిచ్చాడు. ఈ సాంగ్ ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. ఇందులో లోకేష్‌తో శృతి ఓ రేంజ్‌లో రొమాన్స్ చేసింది. 18 సెకన్ల పాటు ఉండే ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీని ఫుల్ సాంగ్ ఈ నెల 25న రిలీజ్ కానుంది.


Updated : 22 March 2024 1:26 PM IST
Tags:    
Next Story
Share it
Top