Home > సినిమా > Bigg BossTelugu Season 7 : నక్క తోక తొక్కిన టేస్టీ తేజ.. బిగ్బాస్ హౌస్ నుంచి ఆమె ఔట్..

Bigg BossTelugu Season 7 : నక్క తోక తొక్కిన టేస్టీ తేజ.. బిగ్బాస్ హౌస్ నుంచి ఆమె ఔట్..

Bigg BossTelugu Season 7 : నక్క తోక తొక్కిన టేస్టీ తేజ.. బిగ్బాస్ హౌస్ నుంచి ఆమె ఔట్..
X

బిగ్బాస్ తెలుగు సీజన్ 7 ఐదోవారం ముగిసింది. ఉల్టాపల్టా కాన్సెప్ట్తో ఈ సీజన్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటోంది. ఇప్పటికే నలుగురు ఫీమేల్ కంటెస్టెంట్లను హౌస్ నుంచి బయటకు పంపారు. ఐదో వారం అయినా మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని అంతా భావించారు. అయితే బిగ్ బాస్ ఈసారి కూడా హౌస్ నుంచి అమ్మాయినే బయటకు పంపినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో బిగ్ బాస్ అమ్మాయిలపై పగబట్టాడని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

ఫిఫ్త్ వీక్లో ప్రియాంక, టేస్టీ తేజ ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ప్రియాంకకు అతి తక్కువ ఓట్లు వచ్చాయని, ఆమెకన్నా తేజకే కాస్త బెటర్ ఓటింగ్ వచ్చిందని టాక్ వినిపించింది. ఈ క్రమంలో ఈ వీకెండ్లో ప్రియాంక, టేస్టీ తేజల్లో ఒకరు ఇంట్లోంచి బయటకు వస్తారని అంతా భావించారు. అయితే శుక్రవారం ప్రియాంకకు ఓటింగ్ పెరిగితే తేజ బయటకు రావడం ఖాయమని, ఈ సీజన్లో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఫస్ట్ మేల్ కంటెస్టెంట్ గా నిలుస్తాడని వార్తలు వచ్చాయి.

బిగ్ బాస్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా శుభ శ్రీ రాయ్గురును ఎలిమినేట్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అతితక్కువ ఓట్లు రావడం వల్లే ఆమెను హౌస్ నుంచి బయటకు పంపారని అంటున్నారు. నిజానికి తన మాటలతో పాటు టాస్కుల్లో బాగానే పర్ఫార్మ్ చేస్తున్న ఈ ఒడియా పిల్ల ఈసారి లీస్ట్ త్రీలో ఉన్నప్పటికీ ఎలిమినేట్ కాకపోవచ్చని అంతా భావించారు. అయితే అందరి ఊహల్ని తలకిందులు చేస్తూ బిగ్ బాస్ ఆమెను హౌస్ నుంచి బయటకు పంపినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ప్రతి వారం తక్కువ ఓట్లతో లీస్ట్లో ఉంటున్న టేస్టీ తేజ ఏదో రకంగా ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటున్నాడు. ఈ వారం డైరెక్ట్ నామినేట్ అయిన తేజ ఎంటర్జైన్ చేయాలని నాగార్జున టాస్క్ ఇచ్చారు. దీంతో తేజ స్క్రీన్ స్పేస్ గ్రాబ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇక కెప్టెన్సీ టాస్క్లో సంచాలకురాలిగా ఉన్న ప్రియాంక తేజకు అన్యాయం చేయడం కూడా అతనికి చివరి గంటలో ఓటింగ్ పెరిగేందుకు కారణమైనట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ఈ వారం కూడా ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న తేజ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే ముందు నక్క తోక తొక్కి ఉంటాడని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.




Updated : 7 Oct 2023 11:14 AM GMT
Tags:    
Next Story
Share it
Top