Home > సినిమా > Siddharth : సురేష్ కొండేటిపై సీరియస్.. మాస్ వార్నింగ్ ఇస్తూ..

Siddharth : సురేష్ కొండేటిపై సీరియస్.. మాస్ వార్నింగ్ ఇస్తూ..

Siddharth : సురేష్ కొండేటిపై సీరియస్.. మాస్ వార్నింగ్ ఇస్తూ..
X

ఏ సినిమా ప్రెస్ మీట్ అయినా.. అందులో మొదట వినిపించే పేరు సురేష్ కొండేటి. సినిమా ప్రెస్ మీట్స్, ప్రమోషన్ మీట్లకు వచ్చి.. తన ప్రశ్నలతో హీరో, హీరోయిన్లను ఇబ్బంది పెడుతుండాడు. ఈ విషయంలో ఆయనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి. తాజాగా మరోసారి హీరోతో చురకలు అంటించుకున్నాడు. హీరో సిద్ధార్థ్ తాజా చిత్ర చిత్తా. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ సినిమా.. సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న సిద్ధార్థ్ కు ఈ సినిమాతో డీసెంట్ హిట్ ఇచ్చింది. దీంతో ఈ సినిమాను చిన్న పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా సినిమా ప్రమోషన్స్ నిర్వహించగా.. దానికి సురేష్ కొండేటి కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా సురేష్ అడిగిన ప్రశ్నలకు సిద్ధార్థ్ సీరియస్ అయి.. మాస్ వార్నింగ్ ఇచ్చాడు.

సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రమోషన్స్ కు వచ్చిన సురేష్ కొండేటికి మాస్ వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నా. ఇది నేను ఇస్తున్న వార్నింగ్ కాదు. సోషల్ మీడియా మొత్తం ఇస్తుంది. ప్రెస్ మీట్ లో పద్దతిగా కూర్చొని. మైక్ పట్టుకుని పద్దతిగా మాట్లాడి, పద్దతిగా ప్రశ్నలు అడగమనండి. ఆయన అడిగే ప్రతి చెత్త ప్రశ్నకు మాకు జవాబు ఇవ్వాల్సిన అవసరంలేదు’ అని అన్నాడు. సిద్ధార్థ్ మాటలకు అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కొంతసేపటి తర్వాత ఆ మాటలకు కవర్ చేసిన సిద్ధార్థ్.. ‘సురేష్ నా ఫ్రెండ్. అతన్ని ఏం అనాలన్నా, అడగాలన్నా నాకు హక్కుంది’ అని చెప్పుకొచ్చాడు.




Updated : 4 Oct 2023 4:11 PM IST
Tags:    
Next Story
Share it
Top