Home > సినిమా > శర్వానంద్ పెళ్లిలో హీరో సిద్ధార్థ్‌ సందడి..వీడియో వైరల్

శర్వానంద్ పెళ్లిలో హీరో సిద్ధార్థ్‌ సందడి..వీడియో వైరల్

శర్వానంద్ పెళ్లిలో హీరో సిద్ధార్థ్‌ సందడి..వీడియో వైరల్
X

టాలీవుడ్ నటుడు శర్వానంద్ ఇటీవల ఒక ఇంటివాడయ్యాడు. జూన్ 3వ తేదిన శర్వానంద్-రక్షిత రెడ్డి వైభవంగా జరిగింది. జైపూర్ లోని లీలా ప్యాలెస్‌లో వీరి వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. శర్వానంద్ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. రెండు రోజులు పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకల కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా హీరో సిద్ధార్థ్ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆయన శర్వానంద్ పెళ్లిలో సందడి చేశారు. స్టేజ్‎పై ‘ఓయ్ ఓయ్’ పాట పాడుతూ అలరించారు. కాన్సెర్ట్‌ జరుగుతుండగా సిద్ధార్థ్‌ వేదికపైకి వేగంగా నడుస్తూ వెళ్లి.. ఓ సింగర్‌ చేతిలోని మైక్‌ తీసుకుని మరో సింగర్‌తో శ్రుతి కలిపాడు. ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

హీరో సిదార్థ్ మల్టీ టాలెంటెండ్. నటనతో పాటు తన సినిమాల్లో తానే స్వయంగా పాటలు పాడిన సందర్భాలున్నాయి. సిద్దార్థ్ పాడిన పాటలు ఓ రేంజ్‌‌లో హిట్ అయ్యాయి. గతంలో ఆడియో ఫంక్షన్ లో కూడా ఆయన తన పాటలు వినిపించారు. బొమ్మరిల్లు చిత్రంలో ‘అప్పుడు ఇప్పుడో’ ఓయ్ సినిమాల ‘ఓయ్ ఓయ్’ లాంటి సిద్దార్థ్ పాడిన పాటలు ఇప్పటికీ అలరిస్తున్నాయి. శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కలిసి ‘మహా సముద్రం’ చిత్రంలో కలిసి నటించడంతో వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. శర్వానంద్ పెళ్లికి రామ్‌చరణ్ కూడా హాజరయ్యారు.

Updated : 6 Jun 2023 10:07 PM IST
Tags:    
Next Story
Share it
Top