Siddu Jonnalagadda : సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా.. ’
X
ఇద్దరు పరిచయస్తు ఒకే అంశం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు తెలుసు కదా.. అని కామన్ గా అడుగుతుంటారు. ఈ తెలుసు కదా అనే మాట రోజూ ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరూ వాడుతుంటారు. అఫ్ కోర్స్ దాని అర్థాలు వేర్వేరుగా ఉంటాయని తెలుసు కదా.. సో.. ఈ మాటనే టైటిల్ గా పెడుతూ ఓ లేడీ డైరెక్టర్ పరిచయం కాబోతోంది. మరి ఈ మూవీలో హీరో ఎవరో తెలుసు కదా.. యస్.. మోస్ట్ హ్యాపెనింగ్ హీరో స్టార్ బాయ్ సిద్ధు అలియాస్ డిజే టిల్లు.
ఒకప్పుడు స్టార్ రైటర్ గా వెలిగిన రచయిత కోన వెంకట్. ఆ టైమ్ లో ఆయన సోదరి నీరజ కోన కాస్ట్యూమ్ డిజైనర్ గా టాప్ హీరోయిన్లందరితోనూ వర్క్ చేసింది. తన వర్క్ కు గొప్ప అప్లాజ్ కూడా వచ్చింది. తనే ఇప్పుడు దర్శకురాలిగా మారింది. ఈ విషయం మొదట్లో చాలామందిని ఆశ్చర్యపరిచింది కూడా. బట్ తను చాలా సీరియస్ గానే ఈ ప్రొఫెషన్ ను సెలెక్ట్ చేసుకుందని టెక్నీషియన్స్ ను అనౌన్స్ చేసినప్పుడు అర్థం అయింది. ఈ చిత్రం కోసం ఏకంగా ఆరుగురు నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. థమన్ సంగీతం చేయబోతున్నారు. ఇక విశేషం ఏంటంటే.. ఈ మూవీ కోసం సిద్ధు జొన్నలగడ్డ సరసన తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సమంతను అప్రోచ్ అయింది. తన హెల్త్ బాలేదు కాబట్టి నో చెప్పింది. దీంతో హీరోయిన్లుగా రాశిఖన్నాతో పాటు కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టిని తీసుకుంది. తాజాగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ విషయంలో నీరజా కోన ఫస్ట్ ఇంప్రెషన్ నే బెస్ట్ గా చూపించింది. ఒక్కో టెక్నీషియన్ అను అనౌన్స్ చేస్తూ సిద్ధను డైనింగ్ టేబుల్ వరకూ తీసుకువచ్చింది. ఈ టేకింగ్ బావుందనే చెప్పాలి. ఆ టైటిల్ తెలుసు కదా అంటూ సిద్ధు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇక మూవీ థీమ్ గా.. ‘ప్రేమించడం ప్రేమించబడటమే మంచి జీవితానికి సరైన దారి’ అంటూ వేసిన క్యాప్షన్ కూడా బావుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించబోతోన్న ఈ మూవీని టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. సినిమా బావుంటే ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తారని తెలుసు కదా..