Home > సినిమా > సైమా అవార్డుల షో డేట్ ఫిక్స్

సైమా అవార్డుల షో డేట్ ఫిక్స్

సైమా అవార్డుల షో డేట్ ఫిక్స్
X

సినిమా అవార్డుల్లో ఒకటైన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్..సైమా డేట్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ఈ వేడుకులను నిర్వహిస్తామని ఛైర్ పర్శన్ బృందా ప్రసాద్ తెలిపారు. దుబాయ్ లో సైమా అవార్డ్స్ ఫంక్షన్ జరగనుంది.





దుబాయ్ లో జరిగే సైమా అవార్డ్ ఫంక్షన్ కు ఆటోమొబైల్ కంపెనీ నెక్సా స్పాన్సర్ గా వ్యవహరించనుంది. ఈ కార్యక్రమానికి రానా హోస్ట్ గా చేయనున్నారు. మరొక హోస్ట్ గా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చేసే అవకాశం ఉంది. రానా, మృణాల్ కాంబినేషన్ లో స్టేజి అదిరిపోతుందని నిర్వాహకులు చెబుతున్నారు.





తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలన్నింటినీ ఒకేచోట చేర్చే కార్యక్రమం సైమా. నాలుగు చిత్ర పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులకు ఇందులో అవార్డులు ఇస్తారు. ప్రతీ ఏడాది ఈ అవార్డుల ఫంక్షన్ జరుగుతుంది. 11 ఏళ్ళుగా సైమా అవార్డులను ఇస్తున్నారు. ఈసారి కూడా దుబాయ్ లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఛైర్ పర్శన్ బృందా ప్రసాద్ చెబుతున్నారు.



Updated : 8 July 2023 12:08 PM IST
Tags:    
Next Story
Share it
Top