Home > సినిమా > ఆ సినిమా హిట్ అయి ఉంటే.. నేను ఇండస్ట్రీలోనే ఉండేదాన్ని

ఆ సినిమా హిట్ అయి ఉంటే.. నేను ఇండస్ట్రీలోనే ఉండేదాన్ని

అయినా పర్లేదు.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తా

ఆ సినిమా హిట్ అయి ఉంటే.. నేను ఇండస్ట్రీలోనే ఉండేదాన్ని
X

హింట్ కాంబినేషన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్- రాజమౌళిల బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి. 2003లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించింది. ఈ చిత్రంలో నటించిన వారందరికీ మంచి పేరుతో పాటు ఎన్నో అవకాశాలు వచ్చాయి. సింహాద్రి సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న అంకిత.. ఆ తరువాత అంకిత టాప్ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారంతా. కానీ ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చినా.. వాటిని సరిగా వాడుకోలేక చివరకు ఆమె సినీరంగానికే దూరమైంది. నాటి పరిస్థితులు, తన కెరీర్ గురించి ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది.

‘‘విజయేంద్ర వర్మ సినిమాపై నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా. కానీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ చిత్రం హిట్ అయి ఉంటే నేను ఇండస్ట్రీలో ఉండేదాన్ని. చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే కెరీర్ ముందుకు సాగుతుంది’’ అని ఆమె గతాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడింది. ఇక హీరో నవదీప్‌తో తనకు ఎలాంటి విభేదాల్లేవని తెలిపింది అంకిత. నవదీప్‌ సరసన నటించిన చిత్రంతోపాటు తమిళంలో మరో సినిమా ఒకే సమయంలో చిత్రీకరణ సాగడంతో ఒత్తిడి ఫీలయ్యానని, ఆ క్రమంలో అసహనానికి లోనవడమే తప్ప ఎలాంటి గొడవ జరగలేదన్నారు. లాస్ట్ ఇయర్ హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun)ని కలిశానని, ఎన్టీఆర్‌తో సోషల్‌ మీడియా వేదికగా టచ్‌లో ఉన్నానని చెప్పింది. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అంటే అభిమానమని, మంచి అవకాశం వస్తే సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది.

2004లో ‘విజయేంద్ర వర్మ’ తరువాత ఆమె నవదీప్ సరసన ‘మనసు మాట వినదు’, గోపిచంద్ నటించిన ‘రారాజు’లో నటించింది. రవితేజ్ హీరోగా రూపొందిన ‘ఖతర్నాక్’ సినిమాలోనూ ఓ స్పెషల్ సాంగ్‌లో తళ్లుక్కుమన్న ఆమె 2009 నుంచి సినీ ఇండస్ట్రీకి దూరమైంది. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ధనలక్ష్మీ.. ఐ లవ్‌ యూ, ప్రేమలో పావని కల్యాణ్‌ చిత్రాల్లో కనిపించింది. అంకిత 2016లో విశాల్ జగపతి అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. ఆ తరువాత వారు అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డారు. వారికి ఇద్దరు అబ్బాయిలు.

Updated : 14 July 2023 11:46 AM IST
Tags:    
author-thhumb

Veerendra Prasad

వీరేందర్ మైక్ టీవీ వెబ్‌సైట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌(సబ్ ఎడిటర్)గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో(V6, T News) రాజకీయం, లైఫ్ స్టైల్, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.


Next Story
Share it
Top